ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుత సమాజంలో చాలా మందికి పెళ్లి వయసు వచ్చిన వివాహం కావడం లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు.అలాగే సిద్ధాంతులకు, జాతకాలు చెప్పే వారికి, పండితులకు వద్దకు వెళుతూ ఉంటారు.
అలాగే పూజలు కూడా చేయిస్తూ ఉంటారు.కానీ మన భారతదేశంలోని ( India )ఒక ఆలయానికి వెళితే సంవత్సరం తిరిగే లోపే వివాహం అవుతుందని స్థానిక భక్తులు చెబుతున్నారు.
ఇంతకు ఆ ఆలయం ఎక్కడ ఉంది.దాన్ని ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే వివాహ వయస్సు దాటిపోతున్న ఇంకా పెళ్లి కాలేదా? ఎన్ని సంబంధాలు చూసినా వివాహం కావడం లేదా.అయితే ఈ దేవాలయానికి వెళ్ళొస్తే సంవత్సరం తిరిగేలోపే వివాహం అవుతుందని అక్కడి పూజారులు చెబుతున్నారు.
జడలు కట్టిన కేశాలతో, తోలు దుస్తులతో కాలసర్పాన్ని కంఠభరణంగా వేసుకొని పరమేశ్వరుడు, ఏడు వారాల నగలతో పట్టుపీతాంబరాలతో సర్వాలంకారశోభితమైన అమ్మవారు కళ్యాణ సుందర దేవాలయంలో( Ammavaru Kalyana Sundara temple ) కొలువై ఉంది.
అలాగే శంకరుడి వాక్కు అయితే పార్వతి దేవి( Goddess Parvati ) ఆ వాక్యానికి అర్థం.ఆయన ఆదిభిక్షువైతే ఆమె ఆయనకు అన్నం పెట్టే అన్నపూర్ణ.ఇంతకన్నా ఒద్దికైన ఆలుమగలు ఎక్కడుంటారు.
అందుకే పార్వతీ పరమేశ్వరులను ఆదిదంపతులు అని పిలుస్తారు.అలాంటి ఆది దంపతులకు కళ్యాణం జరిగిన ప్రదేశమే కళ్యాణ సుందర్ దేవాలయం.
ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా కుట్టాలమ్( Kuttalam ) నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది.కావేరి నది తీర ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయంలోనే పార్వతీ పరమేశ్వరుల పాణిగ్రహణ విగ్రహాన్ని దర్శించుకోవచ్చు.
ఈ ప్రదేశంలో శివపార్వతులైన ఆ ఆది దంపతుల వివాహం జరిగినా పవిత్రమైన స్థలంగా భక్తులు చెబుతూ ఉంటారు.అందుకే వివాహం కాని వారు ఒక్కసారి ఈ దేవాలయానికి వెళ్ళొస్తే చాలు సంవత్సరం తిరిగేలోపే వివాహం జరుగుతుందని భక్తులు నమ్ముతారు.ఈ దేవాలయాన్ని చోళులు నిర్మించినట్లు పురాణాలలో ఉంది.ఇక్కడి శివాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు వరుసగా సేవలు కొనసాగుతూ ఉంటాయి.
LATEST NEWS - TELUGU