మొక్కలకు కూడా వాస్తు ఉందని మీకు తెలుసా..? అయితే ఈ మొక్కల నీడ పడితే మాత్రం..!

వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు ప్రతి ఒక్క దానికి కూడా ఉంటుంది.అలాగే మొక్కలకు కూడా వాస్తు శాస్త్రం( Vastu Shastram ) ఉంది.

 Did You Know That Plants Also Have Vastu But If The Shade Of These Plants Falls-TeluguStop.com

అందుకే మొక్కలను కూడా సరిగ్గా వాస్తు శాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకొని నాటాలి.ఎలా నాటితే ఇంట్లో శాంతి, ఆనందం కలుగుతాయి.

అలాగే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ దూరమవుతాయి.పురాతన భారతీయ వాస్తు సిద్ధాంతమైన వాస్తు శాస్త్ర నియమాలను ఆలోచించడం ద్వారా మీ జీవితంలో సామరస్యం, శాంతి, శ్రేయస్సు, ఆరోగ్యాన్ని తీసుకురావచ్చు అని అందరూ నమ్ముతారు.

కాబట్టి ఇంటి యజమానులు తమ ఇంటి తోటను ( Home garden )ఏర్పాటు చేసుకోవాలనుకునేటప్పుడు మొక్కల కోసం వాస్తు సూత్రాలను పాటించాలి.అయితే ఇంట్లో లేదా కార్యాలయంలో చిన్న మొక్కలను నాటడం వలన అవి తాజాదనాన్ని అందించడమే కాకుండా ప్రదేశాన్ని అందంగా మారుస్తాయి.

ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కలు సరిగ్గా ఎక్కడనాటితే శాంతి, ఆనందాన్ని కలుగజేస్తాయో చాలా క్షుణ్ణంగా చెప్పింది.అయితే మొక్కలు ఇంట్లో సానుకూల శక్తిని ఇస్తాయి.

Telugu Big Trees, Garden, Southwest, Vasthu, Vasthu Tips, Vastu, Vastu Shastram-

అలాగే ఇంట్లో తోటను ఏర్పాటు చేసుకోవడం వలన మంచి ఫలితాలు ఉంటాయి.అయితే తోటను ఏర్పాటు చేసుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి.ఆ నియమాలను శ్రద్ధగా పాటిస్తే ప్రతి పని కూడా శుభప్రదంగా జరుగుతుంది.అలాగే ప్రతికూల శక్తులు కూడా ఇంట్లోకి ప్రవేశించవు.అయితే తోటలోని ప్రతి విభాగం పంచ మహా భూతాలలోని ఐదు అంశాలలో ఒక దానిని పోలి ఉంటుంది.అందుకే ఇంటి నైరుతి ( Southwest )విభాగం భూమిని సూచిస్తుంది.

అలాగే ఈశాన్యం నీటిని సూచిస్తుంది.

ఆగ్నేయం అగ్నిని సూచిస్తుంది.

అయితే వాయువ్యం గాలిని సూచిస్తుంది.కేంద్రం అంతరిక్షాన్ని సూచిస్తుంది.

ఆగ్నేయ లేదా నైరుతిలో ఉద్యానవనం కలిగిస్తుంది.అయితే తోట నిర్మించేటప్పుడు తూర్పు లేదా ఉత్తర విభాగాలలో చిన్న పొదలను నాటాలి.

ఇక ఈశాన్యభాగాన్ని తెరిచి వదిలేయాలి.ఇక పశ్చిమ దక్షిణ నైరుతి విభాగాలలో పొడవైన చెట్లను నాటాలి.

ఇక ప్రధాన ఇల్లు, చెట్ల మధ్య దూరం ఉంచాలి.

Telugu Big Trees, Garden, Southwest, Vasthu, Vasthu Tips, Vastu, Vastu Shastram-

అయితే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వాటి నీడ ఇంటిపై అసలు పడకూడదు.అలాగే పెద్ద చెట్లను( Big trees ) కూడా ఇంటికి చాలా దగ్గరగా నాటకూడదు.ఎందుకంటే వాటి మూలాలు ఇంటి పునాదిని దెబ్బతీస్తాయి.

అలాగే కీటకాలు, పురుగులు, తేనెటీగలు లేదా పాములు ఇలాంటి వాటిని ఆకర్షించే చెట్లను తోటలో నివారించాలి.అలాంటి చెట్లను నాటితే దురదృష్టాన్ని తెస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube