అంతర్జాతీయ మహిళా దినోత్సవం (Women’s Day)సందర్భంగా న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (ఎఫ్ఐఏ) భాగస్వామ్యంతో విభిన్న రంగాలలో అత్యుత్తమ కృషి చేసిన ముగ్గురు భారత సంతతి మహిళలను సత్కరించింది.జేపీ మోర్గాన్‌లో అడ్వైజరీ అండ్ మెర్జర్స్ & అక్విజిషన్స్ గ్లోబల్ హెడ్ అను అయ్యంగార్.
ఏ- సిరీస్ మేనేజ్‌మెంట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ సీఈవో వ్యవస్ధాపకురాలు అంజుల ఆచారియా(Anjula Acharya).సీఎన్‌బీసీలో రిపోర్టర్, యాంకర్‌గా పనిచేస్తున్న సీమా మోడీలను కాన్సులేట్ సత్కరించింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఎఫ్ఐఏ (FIA)నిర్వహించడం ఇది ఏడో సారి.ఈ కార్యక్రమానికి కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి(Annapurna Devi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
భారత్ – అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మహిళలను సాధికారపరచడంలో చేసిన కృషికి గాను అవార్డ్ గ్రహీతలను అన్నపూర్ణా దేవి (Annapurna Devi)ప్రశంసించారు.

కేరళలో జన్మించిన అను అయ్యంగార్ అమెరికాలోని స్మిత్ కాలేజ్‌లో ఆర్ధిక శాస్త్రాన్ని అభ్యసించారు.అనంతరం వాండర్ బిల్ట్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.1999లో జేపీ మోర్గాన్ ఎండీగా బాధ్యతలు స్వీకరించారు.2020లో 50 ఏళ్ల వయసులో ఈ సంస్థ అడ్వైజరీ అండ్ మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ గ్లోబల్ హెడ్‌గా ఎదిగారు.ఆ పదవిని నిర్వహించిన ఏకైక మహిళగా, తొలి వర్ణేతర వ్యక్తిగా అను చరిత్ర సృష్టించారు.
ఏ- సిరీస్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ సీఈవో, ఫౌండర్ అంజుల ఆచారియా.బంబల్, క్లాస్ పాస్ వంటి స్టార్టప్‌లకు మద్ధతు ఇవ్వడంలో కీలకపాత్ర పోషించారు.ఆమె 2006లో దేశీ హిట్స్‌ను స్ధాపించి .బ్రిట్నీ స్పియర్స్, లేడీ గాగా వంటి పాశ్చాత్య కళాకారులను భారతీయ ప్రేక్షకులకు పరిచయం చేశారు.ట్రినిటీ వెంచర్స్‌లో పెట్టుబడిదారురాలు అలాగే బజ్ ఫీడ్ బోర్డ్ సభ్యురాలు కూడా.

సీమా మోడీ .సీఎన్‌బీసీ జర్నలిస్ట్.ప్రపంచ మార్కెట్లు, సాంకేతికతలో ఆమె స్వరం అందరికీ సుపరిచితం.
ముంబైలోని సీఎన్‌బీసీ -టీవీ 18లో తన కెరీర్‌ను ప్రారంభించి, భారతదేశ ఆర్ధిక వృద్ధిని కవర్ చేశారు.అనంతరం అమెరికాకు వెళ్లి అక్కడ టెక్, ఐపీవో మార్కెట్‌పై నివేదించింది.
బ్రెగ్జిట్, చైనా కరెన్సీ విలువ తగ్గడం వంటి ప్రధాన ఆర్ధిక సంఘటనలను సీమా మోడీ కవర్ చేశారు.







