బీజేపీ అగ్రనాయకత్వం సౌత్ పై దృష్టి సారించింది.సౌత్ లోని రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని ప్రత్యేక ప్రణాళికలను రచిస్తోంది.
ఈ క్రమంలోనే తెలంగాణతో పాటు కర్ణాటకపై బీజేపీ ఫోకస్ పెట్టింది.ఇప్పటికే తెలంగాణలో బీజేపీ పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ కానున్నారు.రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రుల పర్యటనలతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై ఇవాళ్టి సమావేశంలో చర్చించనున్నారని తెలుస్తోంది.







