పసుపును సౌందర్యానికి మన పూర్వికుల కాలం నుండి వాడుతూ ఉన్నారు.పసుపులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన మొటిమలు,నల్లని మచ్చలు,అలసిన చర్మానికి ఉత్తేజాన్ని ఇవ్వటంలో చాలా బాగా సహాయపడుతుంది.
ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ లో ముఖం చాలా త్వరగా అలసటకు గురి అవుతూ ఉంటుంది.ఈ అలసటను దూరం చేసుకోవటానికి ఇప్పుడు చెప్పే ఫెస్ పాక్స్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.ఇప్పుడు ఫెస్ పాక్స్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
ఒక స్పూన్ శనగపిండిలో ఒక స్పూన్ రోజ్ వాటర్,చిటికెడు పసుపు వేసి బాగా కలిపి పేస్ట్ గా తయారుచేసుకోవాలి.
ఈ పేస్ట్ ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకొని తేలికపాటి స్కిన్ టోనర్ ని రాయాలి.రెండు స్పూన్ల పెరుగులో చిటికెడు పసుపు,రెండు చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఒక స్పూన్ తేనెలో చిటికెడు పసుపు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ లో అర స్పూన్ గంధం పొడి,చిటికెడు పసుపు వేసి బాగా కలిపి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే అలసిన ముఖానికి ఉత్తేజం కలుగుతుంది.