అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్ధ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా( FBI Director ) భారత సంతతికి చెందిన కశ్యప్ పటేల్ (కాష్ పటేల్)ను( Kashyap Patel ) డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.ఎఫ్‌బీఐ ధ్రువీకరణకు సంబంధించిన విచారణ సందర్భంగా తన తల్లిదండ్రుల పాదాలను తాకుతూ కనిపించిన కాష్ పటేల్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఓ అలాగే తన తల్లిదండ్రులను పరిచయం చేస్తున్నప్పుడు జై శ్రీకృష్ణ అని అంటూ కాష్ పటేల్ చేసిన నినాదాలు కూడా వైరల్ అయ్యాయి.
ఈ రోజు ఇక్కడ ఉన్న నా తండ్రి ప్రమోద్, తల్లి అంజనాలు భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చారు.
వీరితో పాటు నా సోదరి నిషా కూడా ఉందని కాష్ పటేల్ తెలిపారు.ఎఫ్‌బీఐ అధిపతిగా ఆమోదం కోసం సెనేట్ జ్యుడీషియరీ కమిటీ ముందు కాష్ పటేల్ హాజరయ్యారు.
ఈ సమయంలో బ్యూరో ప్రతిపాదిత సవరణ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్ల తన విధేయతను చూపుతూ సెనేటర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు పటేల్.

ఎవరీ కశ్యప్ పటేల్ :
గుజరాత్( Gujarat ) మూలాలున్న తల్లిదండ్రులకు న్యూయార్క్‌లో( New York ) 1980లో జన్మించారు కాష్ పటేల్.తొలుత వీరి కుటుంబం ఆఫ్రికాలోని ఉగాండాలో ఉండేది.అయితే అప్పటి ఆ దేశ అధినేత ఈదీ ఆమిన్ వేధింపుల కారణంగా కాష్ తల్లిదండ్రులు అమెరికాకు వలస వచ్చారు.
యూనివర్సిటీ ఆఫ్ రిచ్‌మాండ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కశ్యప్.అనంతరం యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో లా పట్ట పొందరు.అనంతరం మియామీ కోర్టులలో పలు హోదాలలో పనిచేశారు.

అమెరికా అధ్యక్షుడికి డిప్యూటీ అసిస్టెంట్‌గా, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎన్ఎస్‌సీ)లో కౌంటర్ టెర్రరిజం సీనియర్ డైరెక్టర్‌గా సేవలందించారు.అతని డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొఫైల్ ప్రకారం.నేషనల్ ఇంటెలిజెన్స్ యాక్టింగ్ డైరెక్టర్‌కు ప్రిన్సిపల్ డిప్యూటీగా కూడా పనిచేశారు.
ఈ హోదాలో ఆయన 17 ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ ఏజెన్సీల కార్యకలాపాలను పర్యవేక్షించడంతో పాటు అధ్యక్షుడి రోజువారీ బ్రీఫింగ్‌ను అందించేవారు.ఇక రిపబ్లికన్ పార్టీకి ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్‌కు వీర విధేయుడిగా కాష్ పటేల్‌కు అమెరికా రాజకీయాల్లో పేరుంది.2020 అధ్యక్ష ఎన్నికల తర్వాత యూఎస్ కేపిటల్ వద్ద చోటు చేసుకున్న ఘటన కేసులో కశ్యప్ పటేల్ పేరు కూడా వినిపించింది.