చైనా( China ) నుంచి ఒక షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సైన్స్ ఫిక్షన్ సినిమా చూస్తున్నట్టుగా ఉంది ఆ దృశ్యం.
ఒక రోబోటిక్ కుక్క,( Robot Dog ) ఒక డ్రోన్.( Drone ) రెండూ బాణాసంచా పేలుస్తూ ఒకదానితో ఒకటి భీకరంగా పోట్లాడుకుంటున్నాయి.
గాల్లో చక్కర్లు కొడుతూ డ్రోన్ ఫైర్ చేస్తుంటే, నేలపై వేగంగా కదులుతూ రోబో డాగ్ దాడులను తప్పించుకుంటూ ఎదురుదాడి చేస్తోంది.చూస్తుంటే భలే గమ్మత్తుగా, అదే సమయంలో భయానకంగా కూడా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ డ్రోన్ చూడటానికి DJI T-సిరీస్ వ్యవసాయ డ్రోన్‌లా ఉంది.ఇక రోబో డాగ్ అయితే హాంగ్‌జౌకి చెందిన యూనిట్రీ రోబోటిక్స్ కంపెనీ తయారు చేసిన గో సిరీస్‌కి చెందినదిగా తెలుస్తోంది.
ఇదంతా ఎవరైనా కావాలని చేసిన ప్రయోగమా లేక నిజంగానే ఈ రెండు యంత్రాలు కయ్యానికి కాలు దువ్వాయా అనేది మాత్రం ఇంకా తెలియలేదు.కానీ వీడియో మాత్రం ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.కొందరు ఈ టెక్నాలజీ( Technology ) భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు తెస్తుందో అని భయపడుతుంటే, మరికొందరు మాత్రం ఈ రెండిట్లో ఏది గెలుస్తుందో అని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.“డ్రోన్ గాల్లో ఈజీగా కదలగలదు కాబట్టి దానికే గెలిచే చాన్స్ ఎక్కువ” అని ఒకరు కామెంట్ చేస్తే, “యుద్ధం మరీ దగ్గరగా జరుగుతోంది, డ్రోన్ తొందరగా డ్యామేజ్ అవుతుంది.దూరంగా ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది” అని ఇంకొకరు వాదిస్తున్నారు.“ఇదే భవిష్యత్తులో యుద్ధమంటే” అని ఒక యూజర్ అంటే, “బ్లాక్ మిర్రర్ ఎపిసోడ్ ఇంత తొందరగా నిజమవుతుందనుకోలేదు” అని ఇంకొకరు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు రోబోటిక్ కుక్కలు, డ్రోన్లు కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోనే కనిపించేవి.కానీ ఇప్పుడు నిజ జీవితంలో ఇండస్ట్రీలను షేప్ చేస్తున్నాయి.రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయో ఈ వీడియో ఒక చిన్న ఉదాహరణ.
ఇది ఎన్నో కొత్త అవకాశాలను తెస్తుండొచ్చు కానీ, కొన్ని సీరియస్ సమస్యలను కూడా తెచ్చే ప్రమాదం లేకపోలేదు.టెక్నాలజీ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది.