సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ( Nandamuri Family ) ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.సీనియర్ నటుడు నందమూరి తారక రామారావు నటనలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇక ఈయన నట వారసులుగా ఎంతో మంది ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ బాలకృష్ణ( Balakrishna ) మాత్రం మంచి సక్సెస్ అందుకున్నారు.ఇక మూడో తరంలో మాత్రం హరికృష్ణ కుమారులు ఆయన ఎన్టీఆర్ ( NTR ) కళ్యాణ్ రామ్( Kalyan Ram ) ఇద్దరు కూడా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కూడా గుర్తింపు పొంది వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ ఉన్న ఈ హీరోలతో నటించడం కోసం హీరోయిన్లు కూడా ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఇండస్ట్రీలో నందమూరి హీరోలుగా కొనసాగుతున్న ఈ ముగ్గురితో కేవలం ఇద్దరి హీరోయిన్లు మాత్రమే నటించారు.మరి ఈ నందమూరి హీరోలతో కలిసి జతకట్టిన ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరు అనే విషయానికి వస్తే….

నందమూరి హీరోలతో కలిసి నటించిన ఇద్దరు హీరోయిన్లు మరెవరో కాదు కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal ) అలాగే ప్రియమణి( Priyamani ).కాజల్ అగర్వాల్ బాలకృష్ణతో కలిసి ఇటీవల భగవంత్ కేసరి సినిమాలో నటించారు.అలాగే ఎన్టీఆర్ తో కలిసి టెంపర్, బృందావనం వంటి సినిమాలలో నటించారు.
ఇక కళ్యాణ్ రామ్ తో కలిసి ఈమె లక్ష్మీ కళ్యాణం అనే సినిమాలో నటించి మెప్పించారు.ఇలా కాజల్ ఈ ముగ్గురు హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు .ఇక మరో నటి ప్రియమణి విషయానికి వస్తే.ఎన్టీఆర్ తో కలిసి యమదొంగ, కళ్యాణ్ రామ్ తో కలిసి హరే రామ్, బాలయ్యతో కలిసి మిత్రుడు అనే సినిమాలో నటించారు ఇలా ప్రియమణి కూడా ఈ ముగ్గురు హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారని చెప్పాలి.