ఎన్ఆర్ఐ ఘాతుకం.. పెళ్లికొచ్చిన అతిథులపై బుల్లెట్ల వర్షం

మేళ తాళాలు, తప్పెట్లు, బంధుమిత్రుల సందడితో పండుగ వాతావరణం నెలకొన్న పెళ్లి వేడుకలో ఓ ఎన్ఆర్ఐ ( NRI ) కలకలం రేపాడు.పంజాబ్‌లోని లూథియానా( Ludhiana ) జిల్లా మల్సియన్ బజాన్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

 Nri Opens Fire At Pre-wedding Function In Punjab Details, Nri , Fire ,pre-weddin-TeluguStop.com

గాల్లోకి కాల్పులు జరపొద్దని అడ్డుకున్నందుకు గాను నిందితుడు ఓ వ్యక్తిపై దాడి చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.ప్రస్తుతం బాధితుడి పరిస్ధితి విషమంగా ఉండగా నిందితుడిని కాకర్ తిహారా గ్రామానికి చెందిన జాస్మాన్ చీనాగా( Jasman Cheena ) గుర్తించారు.

ఈ ఘటనపై సిధ్వాన్ బెట్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది.అయితే పోలీసులు కేసు నమోదు చేసేందుకు ఆలస్యం చేశారని.

దీంతో నిందితుడు కెనడాకు( Canada ) వెళ్లిపోయాడని బాధితుడి కుటుంబం ఆరోపిస్తోంది.

బాధితుడు జగ్రావ్‌లోని అలీఘర్ గ్రామానికి చెందిన 26 ఏళ్ల మంజిందర్ సింగ్( Manjinder Singh ) వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఫిబ్రవరి 15న తన సోదరుడు హర్వీందర్ సింగ్ స్నేహితుడైన జస్‌ప్రీత్ సింగ్( Jaspreet Singh ) వివాహానికి హాజరై.తన బంధువు దల్జిత్ సింగ్‌తో కలిసి భోజనం చేస్తున్నట్లు మంజిందర్ తెలిపారు.

నిందితుడు జాస్మాన్ చీనా అతనికి పరిచయస్తుడే కావడంతో వారి వద్దకి వచ్చి కూర్చొన్నాడు.అప్పటికే అతను పీకల్లోతు తాగి ఉన్నాడని మంజిందర్ చెప్పారు.

Telugu Jasman Cheena, Kakar Tihara, Ludhiana, Manjinder Singh, Nri, Pre, Punjab,

పెళ్లి వేడుక( Wedding ) సందర్భంగా గాల్లోకి కాల్పులు జరిపేందుకు చీనా తన తుపాకీని బయటికి తీశాడని .అయితే తాను అతనిని అడ్డుకున్నట్లుగా మంజిందర్ తెలిపారు.రివాల్వర్‌ను తక్షణం లోపల పెట్టాలని చెప్పానని, అయితే చీనా తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ, బెదిరించాడని మంజిందర్ అన్నాడు.పరిస్ధితి చేయి దాటేలా ఉండటంతో తాను ఆ వేడుక నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నానని బాధితుడు చెప్పాడు.

Telugu Jasman Cheena, Kakar Tihara, Ludhiana, Manjinder Singh, Nri, Pre, Punjab,

తాను అక్కడి నుంచి వెళ్తుండగా చీనా నాపై కాల్పులు జరపడంతో ఓ బుల్లెట్ నా వెన్నుపాము వద్ద తగలడంతో కిందపడిపోయినట్లు మంజింద్ వెల్లడించారు.వెంటనే అప్రమత్తమైన నా సోదరుడు, ఇతరులు తనను వెంటనే జగ్రాన్‌లోని సివిల్ హాస్పిటల్‌కు తరలించగా.మెరుగైన చికిత్స నిమిత్తం లూథియానాలోని దయానంద్ మెడికల్ కాలేజ్‌కు తరలించినట్లు బాధితుడు తెలిపాడు.ప్రస్తుతం ఈ ఘటన పంజాబ్‌లో కలకలం రేపుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube