ఎన్ఆర్ఐ ఘాతుకం.. పెళ్లికొచ్చిన అతిథులపై బుల్లెట్ల వర్షం

మేళ తాళాలు, తప్పెట్లు, బంధుమిత్రుల సందడితో పండుగ వాతావరణం నెలకొన్న పెళ్లి వేడుకలో ఓ ఎన్ఆర్ఐ ( NRI ) కలకలం రేపాడు.

పంజాబ్‌లోని లూథియానా( Ludhiana ) జిల్లా మల్సియన్ బజాన్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

గాల్లోకి కాల్పులు జరపొద్దని అడ్డుకున్నందుకు గాను నిందితుడు ఓ వ్యక్తిపై దాడి చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

ప్రస్తుతం బాధితుడి పరిస్ధితి విషమంగా ఉండగా నిందితుడిని కాకర్ తిహారా గ్రామానికి చెందిన జాస్మాన్ చీనాగా( Jasman Cheena ) గుర్తించారు.

ఈ ఘటనపై సిధ్వాన్ బెట్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది.అయితే పోలీసులు కేసు నమోదు చేసేందుకు ఆలస్యం చేశారని.

దీంతో నిందితుడు కెనడాకు( Canada ) వెళ్లిపోయాడని బాధితుడి కుటుంబం ఆరోపిస్తోంది.బాధితుడు జగ్రావ్‌లోని అలీఘర్ గ్రామానికి చెందిన 26 ఏళ్ల మంజిందర్ సింగ్( Manjinder Singh ) వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఫిబ్రవరి 15న తన సోదరుడు హర్వీందర్ సింగ్ స్నేహితుడైన జస్‌ప్రీత్ సింగ్( Jaspreet Singh ) వివాహానికి హాజరై.

తన బంధువు దల్జిత్ సింగ్‌తో కలిసి భోజనం చేస్తున్నట్లు మంజిందర్ తెలిపారు.నిందితుడు జాస్మాన్ చీనా అతనికి పరిచయస్తుడే కావడంతో వారి వద్దకి వచ్చి కూర్చొన్నాడు.

అప్పటికే అతను పీకల్లోతు తాగి ఉన్నాడని మంజిందర్ చెప్పారు. """/" / పెళ్లి వేడుక( Wedding ) సందర్భంగా గాల్లోకి కాల్పులు జరిపేందుకు చీనా తన తుపాకీని బయటికి తీశాడని .

అయితే తాను అతనిని అడ్డుకున్నట్లుగా మంజిందర్ తెలిపారు.రివాల్వర్‌ను తక్షణం లోపల పెట్టాలని చెప్పానని, అయితే చీనా తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ, బెదిరించాడని మంజిందర్ అన్నాడు.

పరిస్ధితి చేయి దాటేలా ఉండటంతో తాను ఆ వేడుక నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నానని బాధితుడు చెప్పాడు.

"""/" / తాను అక్కడి నుంచి వెళ్తుండగా చీనా నాపై కాల్పులు జరపడంతో ఓ బుల్లెట్ నా వెన్నుపాము వద్ద తగలడంతో కిందపడిపోయినట్లు మంజింద్ వెల్లడించారు.

వెంటనే అప్రమత్తమైన నా సోదరుడు, ఇతరులు తనను వెంటనే జగ్రాన్‌లోని సివిల్ హాస్పిటల్‌కు తరలించగా.

మెరుగైన చికిత్స నిమిత్తం లూథియానాలోని దయానంద్ మెడికల్ కాలేజ్‌కు తరలించినట్లు బాధితుడు తెలిపాడు.

ప్రస్తుతం ఈ ఘటన పంజాబ్‌లో కలకలం రేపుతోంది.