నేను రావణుని పాత్ర పోషించడానికి అసలు కారణమిదే.. హీరో యశ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలతో పాటు శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును కలిగి ఉన్న నటులలో యశ్( Yash ) ఒకరు.బాలీవుడ్ రామాయణంలో( Bollywood Ramayan ) రావణుని పాత్రలో యశ్( Yash Raavan Role ) కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

 Hero Yash Comments About Ravana Role Details Inside Goes Viral In Social Media,-TeluguStop.com

అయితే యశ్ కెరీర్ పరంగా బిజీగా ఉన్న తరుణంలో రావణుని పాత్ర పోషించడం గురించి కీలక విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

రామాయణంలో నేను పోషించే పాత్ర అద్భుతమైన పాత్ర అని ఈ కథలో నటించడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవని యశ్ చెప్పుకొచ్చారు.

కేవలం ఆ పాత్రలో నటించాలనే ఉద్దేశంతో ఓకే చెప్పానని యశ్ వెల్లడించారు.రామాయణానికి సంబంధించి ఇది కాకుండా వేరే రోల్ చేస్తారా అనే ప్రశ్నకు నేను తప్పకుండా నో అనే చెబుతానని యశ్ పేర్కొన్నారు.

Telugu Yash, Kgf, Ranbir Kapoor, Ravana Role, Sai Pallavi, Toxic, Yash Ramayan-M

ఒక సహాయనటుడిగా ఈ పాత్ర నాకు ఒకింత సవాలుతో కూడిన పాత్ర అని యశ్ వెల్లడించారు.రణ్ బీర్ కపూర్,( Ranbir Kapoor ) సాయిపల్లవి( Sai Pallavi ) ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుండగా 2026 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.యశ్ ప్రస్తుతం టాక్సిక్( Toxic ) అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.ఈ సినిమా భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో తెరకెక్కుతోంది.

Telugu Yash, Kgf, Ranbir Kapoor, Ravana Role, Sai Pallavi, Toxic, Yash Ramayan-M

కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలు యశ్ మార్కెట్ ను అంచనాలకు మించి పెంచేశాయి.టాక్సిక్ సినిమా కోసం ఒకింత భారీ స్థాయిలోనే ఖర్చు అవుతోందని తెలుస్తోంది.ఈ సినిమాను కన్నడతో పాటు ఇంగ్లీష్ లో కూడా షూట్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

యశ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది.యశ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.యశ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube