నేను రావణుని పాత్ర పోషించడానికి అసలు కారణమిదే.. హీరో యశ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలతో పాటు శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును కలిగి ఉన్న నటులలో యశ్( Yash ) ఒకరు.

బాలీవుడ్ రామాయణంలో( Bollywood Ramayan ) రావణుని పాత్రలో యశ్( Yash Raavan Role ) కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

అయితే యశ్ కెరీర్ పరంగా బిజీగా ఉన్న తరుణంలో రావణుని పాత్ర పోషించడం గురించి కీలక విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

రామాయణంలో నేను పోషించే పాత్ర అద్భుతమైన పాత్ర అని ఈ కథలో నటించడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవని యశ్ చెప్పుకొచ్చారు.

కేవలం ఆ పాత్రలో నటించాలనే ఉద్దేశంతో ఓకే చెప్పానని యశ్ వెల్లడించారు.రామాయణానికి సంబంధించి ఇది కాకుండా వేరే రోల్ చేస్తారా అనే ప్రశ్నకు నేను తప్పకుండా నో అనే చెబుతానని యశ్ పేర్కొన్నారు.

"""/" / ఒక సహాయనటుడిగా ఈ పాత్ర నాకు ఒకింత సవాలుతో కూడిన పాత్ర అని యశ్ వెల్లడించారు.

రణ్ బీర్ కపూర్,( Ranbir Kapoor ) సాయిపల్లవి( Sai Pallavi ) ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుండగా 2026 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.

యశ్ ప్రస్తుతం టాక్సిక్( Toxic ) అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.ఈ సినిమా భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో తెరకెక్కుతోంది.

"""/" / కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలు యశ్ మార్కెట్ ను అంచనాలకు మించి పెంచేశాయి.

టాక్సిక్ సినిమా కోసం ఒకింత భారీ స్థాయిలోనే ఖర్చు అవుతోందని తెలుస్తోంది.ఈ సినిమాను కన్నడతో పాటు ఇంగ్లీష్ లో కూడా షూట్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.

త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

యశ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది.యశ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.

యశ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం ఊహించని స్థాయిలో పెరుగుతోంది.