ఆ దేశాలలో డాకు మహారాజ్ హవా.. ఓటీటీలో బాలయ్య రికార్డులు క్రియేట్ అవుతున్నాయా?

బాలయ్య బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన డాకు మహారాజ్( Daaku Maharaaj ) మూవీ నెట్ ఫ్లిక్స్( Netflix ) ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్ అవుతోందని ఇప్పటికే చెప్పుకున్నాం.అయితే ఈ సినిమా ఇతర దేశాల్లో కూడా సంచలన రికార్డులను క్రియేట్ చేస్తుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

 Daaku Maharaaj Movie Domination In Foreign States Details, Daaku Maharaaj, Balak-TeluguStop.com

ఈ నెల 21వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండగా ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

పాకిస్తాన్, బంగ్లాదేశ్, యూఏఈలలో డాకు మహారాజ్ మూవీ టాప్2 లో ట్రెండింగ్ లో నిలవడం గమనార్హం.

ఇతర దేశాలలో టాలీవుడ్ సినిమా టాప్2 లో ట్రెండింగ్ కావడం సాధారణమైన విషయం కాదు.డాకు మహారాజ్ నెట్ ఫ్లిక్స్ లో సైతం అంచనాలకు మించి విజయం సాధించింది.

బాలయ్య( Balayya ) సినిమాలు ఓటీటీలో సైతం సంచలనాలు సృష్టిస్తున్నాయి.

Telugu Balakrishna, Daaku Maharaaj, Daakumaharaaj, Bobby, Netflix-Movie

బాలయ్య సినిమాల డిజిటల్ హక్కులకు ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొంది.అఖండ, వీరసింహారెడ్డి డిజిటల్ రైట్స్ ను హాట్ స్టార్ సొంతం చేసుకోగా భగవంత్ కేసరి డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.డాకు మహారాజ్ డిజిటల్ హక్కులు మాత్రం నెట్ ఫ్లిక్స్ సొంతమయ్యాయి.

నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా కోసం ఒకింత భారీ స్థాయిలో ఖర్చు చేసిందని తెలుస్తోంది.

Telugu Balakrishna, Daaku Maharaaj, Daakumaharaaj, Bobby, Netflix-Movie

టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన క్రేజీ సినిమాల హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంటూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.డాకు మహారాజ్ మూవీ ఫుల్ రన్ లో 85 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోగా బాలయ్య సినీ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమా ఇదే కావడం గమనార్హం.బాలయ్య తర్వాత మూవీ అఖండ సీక్వెల్ పై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube