కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్( Dark circles ) అసహ్యంగా కనిపిస్తున్నాయా.? వాటిని వదిలించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయారా.? అయితే డోంట్ వర్రీ.కంటినిండా నిద్ర లేకపోవడం, ఒత్తిడి, పలు రకాల మందుల వాడకం, డిప్రెషన్ తదితర కారణాల వల్ల కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి.
అయితే వారంలోనే వీటిని మాయం చేసే ఎఫెక్టివ్ రెమెడీస్ ఉన్నాయి.

రెమెడీ 1: ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ ( Vitamin E oil )మరియు వన్ టీ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut oil ) వేసుకోవాలి.వీటితో పాటుగా పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు,( Organic turmeric ) హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని సున్నితంగా రెండు మూడు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
నైట్ నిద్రించేముందు ఈ ఐ మాస్క్ వేసుకుని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.లేదా ఐ మాస్క్ వేసుకున్న 20 నిమిషాల తర్వాత కూడా తొలగించవచ్చు.
రెగ్యులర్ గా ఈ రెమెడీని ప్రయత్నించారంటే కేవలం వారంలోనే రిజల్ట్ గమనిస్తారు.ఈ రెమెడీ డార్క్ సర్కిల్స్ ను చాలా వేగంగా తగ్గిస్తుంది.
కళ్ళ వద్ద ఏమైనా ముడతలు ఉన్న కూడా వాటిని దూరం చేస్తుంది.

రెమెడీ 2: ఒక బౌల్ తీసుకుని అందులో హాఫ్ టీ స్పూన్ కాఫీ పౌడర్ ( Coffee powder )వేసుకోవాలి.అలాగే పావు టీ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ తేనె( honey ), వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చి పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ రెమెడీని పాటించిన కూడా మీరు మంచి రిజల్ట్ పొందుతారు.
కళ్ళ చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలను వదిలించడంలో ఈ హోమ్ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.