బిర్మింగ్‌హామ్‌లో పిల్లి సైజు ఎలుకలు.. భయంతో వణుకుతున్న నగరవాసులు..?

బ్రిటన్ లోని రెండో అతిపెద్ద నగరం బిర్మింగ్‌హామ్( Birmingham ) ఇప్పుడు చెత్తతో నిండిపోయింది.కార్మికుల సమ్మెతో( Workers Strike ) సిటీ మొత్తం మురికి కూపంగా మారింది.

 Birmingham Rats Size Cats Food Bin Bags Piled Strikes Details, Birmingham Rats,-TeluguStop.com

ఏకంగా 17 వేల టన్నుల చెత్త పేరుకుపోవడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా చెత్త, దానిపై పిల్లి సైజు ఎలుకలు( Rats ) హల్‌చల్ చేస్తున్నాయి.

అసలు విషయం ఏంటంటే, కార్మికుల జీతాలు భారీగా తగ్గించారట.లేబర్ పార్టీ నడుపుతున్న సిటీ కౌన్సిల్ ఏకంగా 8 వేల పౌండ్ల వరకు కోత పెట్టిందని కార్మికులు మండిపడుతున్నారు.

దీంతో విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు దిగారు.కౌన్సిల్ మాత్రం జీతాలు తగ్గలేదని బుకాయిస్తోంది.

కానీ వర్కర్లు మాత్రం వెనక్కి తగ్గట్లేదు.ఫలితంగా నగరమంతా చెత్త గుట్టలుగా మారిపోయింది.

చెత్త కుప్పలు( Garbage ) పగిలిపోయి దుర్వాసనతో జనం విలవిలలాడుతున్నారు.ఆ వాసన భరించలేక కొందరు జబ్బున పడుతున్నారు.పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, స్థానికులు దీన్ని “అపోకలిప్టిక్” అంటున్నారు.మామూలుగా బతకడం కూడా కష్టంగా మారిందని వాపోతున్నారు.

సీన్ మరీ శృతిమించడంతో బ్రిటీష్ ఆర్మీ( Britain Army ) రంగంలోకి దిగిందట.చెత్తను క్లియర్ చేయడానికి, ఎలుకల్ని కంట్రోల్ చేయడానికి సైన్యం దిగిందంటే పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు.

లేబర్ కౌన్సిల్ అయితే ఏకంగా “మేజర్ ఇన్సిడెంట్” అని ప్రకటించింది.

ఆరు వారాలుగా బిర్మింగ్‌హామ్ చెత్త గుట్టల్లో కొట్టుమిట్టాడుతోంది.ఎక్కడ చూసినా చెత్తాచెదారం, దానికి తోడు రోగాల పుట్టల్లాంటి ఎలుకలు.చాలా కుటుంబాలు సొంత డబ్బులు పోసి ప్రైవేట్ కంపెనీలతో ఇళ్ల చుట్టూ క్లీన్ చేయించుకుంటున్నారు.

ఒక్కొక్కరూ వందల పౌండ్లు ఖర్చు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో అయితే బిర్మింగ్‌హామ్ వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

చెత్తతో నిండిన వీధులు, ఎలుకలు స్వైరవిహారం చేస్తున్న దృశ్యాలు, జబ్బుపడిన ప్రజల ఆర్తనాదాలు చూసి జనం షాకవుతున్నారు.సమ్మె ఎప్పుడు ఆగుతుందో, ఈ సమస్య ఎప్పుడు తీరుతుందో తెలియక బిర్మింగ్‌హామ్ ప్రజలు మాత్రం నరకం చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube