ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ పికు సింగ్( Fitness Influencer Piku Singh ) చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కానీ ఇది మంచి కోసం కాదు, తప్పు పని చేసి విమర్శలు తెచ్చుకుంది పికు.
ఇంతకీ ఏం చేసిందంటే, రైలు పట్టాలపై,( Railway Track ) అది కూడా వేగంగా కదులుతున్న రైలు పక్కనే పరుగెత్తింది ఈ అమ్మాయి.తన ఇన్‌స్టా పేజీలో ఈ వీడియో పెట్టగానే జనాలు షాక్ అయ్యారు.
ఇంత డేంజరస్ స్టంట్ ఎందుకు చేసిందని తిట్టిపోస్తున్నారు.
ఆ వీడియోలో పికు సింగ్ ఫుల్ ఎనర్జీతో రైలుకి కొన్ని అడుగుల దూరంలో పరుగెడుతూ కనిపించింది.
రైలు ఎంత స్పీడుగా వెళ్తుందో, అంతే స్పీడుతో పరిగెత్తడానికి ట్రై చేసింది.చూడటానికి కాన్ఫిడెంట్‌గా, ఫోకస్‌డ్‌గా కనిపించినా, చాలా మంది మాత్రం అమ్మాయి చేసిన పనికి టెన్షన్ పడిపోయారు.
ప్రాణాలతో చెలగాటమాడుతోందని కామెంట్స్ చేస్తున్నారు.
వీడియో పోస్ట్ చేసిన వెంటనే నెటిజన్లు రియాక్ట్ అయ్యారు.వ్యూస్, పాపులారిటీ కోసం ఇంత రిస్క్ చేయాలా అని దుమ్మెత్తిపోస్తున్నారు.ఒక యూజర్ అయితే “ఔట్ ఔట్” అంటూ కామెంట్ పెట్టాడు.
అంటే నువ్వు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యావ్ అని అర్థం.ఇంకొకరు సీరియస్‌గా వార్నింగ్ ఇస్తూ.“మార్ జాయేగీ లడ్కీ… వ్యూస్ కే లియే మత్ కర్.జబ్ నార్మల్ సహీ సే లాంగ్ రన్నింగ్( Long Running ) కర్ సకతీ హై తో యే కర్నా జరూరి హై కియా… #బీటా జిస్ రాహ్ పే జా రహే హో ఏక్ దిన్ జరూర్ ఫాసోగే, మారోగే” అని రాశాడు.
అంటే “ఈ అమ్మాయి చచ్చిపోతుంది వ్యూస్ కోసం ఇలాంటివి చేయకు.నువ్వు నార్మల్‌గా బాగానే పరిగెత్తగలవు కదా, మళ్లీ ఇదెందుకు? నువ్వు వెళ్తున్న దారిలో ఒకరోజు కచ్చితంగా చిక్కుల్లో పడతావ్ లేదా చస్తావ్” అని హెచ్చరించాడు.
చాలా మంది ఆమె సేఫ్టీ గురించే కాదు, ఈ వీడియో వల్ల తప్పుడు మెసేజ్ వెళ్తుందని కూడా భయపడుతున్నారు.యంగ్ ఫ్యాన్స్ దీన్ని చూసి డేంజర్ అని తెలియకుండా కాపీ కొట్టే ప్రమాదం ఉందని అంటున్నారు.
అయితే అందరూ ఆమెను తిట్టలేదు.కొంతమంది ఫాలోవర్స్ మాత్రం ఫైర్, క్లాపింగ్ ఎమోజీలు పెట్టి సపోర్ట్ చేస్తున్నారు.
ఆమె ఫిట్‌నెస్‌ను మెచ్చుకుంటూ, వీడియో సినిమాటిక్‌గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
ఏదేమైనా, ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
ఇన్‌ఫ్లుయెన్సర్లు వైరల్ కంటెంట్ కోసం ఎంత రిస్క్ తీసుకుంటున్నారనే దానిపై డిబేట్ నడుస్తోంది.