ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజలు ఎముకలు విరగడం వల్ల ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు.మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎముకలు కచ్చితంగా బలంగా ఉండాలి.
ఎముకలు కండరాలకు ( Bones ) అండగా నిలవడంతో పాటు శరీరంలో స్థిరమైన ఆకారాన్ని కల్పించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.ఎముకలు విరిగిన అతుక్కునే శక్తి వాటికి ఖచ్చితంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే ఎముక విరిగిందంటే కొన్ని సార్లు శాస్త్ర చికిత్సలు చేయించుకోవాల్సి ఉంటుందని కూడా చెబుతున్నారు.శాస్త చికిత్స ద్వారా విరిగిన ఎముకలను అతుక్కునేలా చేస్తారు.
ఎముకల బలానికి క్యాల్షియం, ఫాస్పేట్( Calcium, Phosphate ) అవసరమని దాదాపు చాలా మందికి తెలుసు.

ఇలాంటి సమయంలో ఎముకలు అతుక్కోవడానికి వయసును బట్టి సమయం మారుతూ ఉంటుంది.ఎక్కువ వయసు ఉన్న వారిలో ఎముక అతుక్కోవడానికి చాలా సమయం పడుతుంది.అలాగే రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ మందికి ఫ్రాక్చర్లు అవుతూ ఉంటాయి.
శరీరక శ్రమ తగ్గిపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎముకలు బలహీనపడి ఇలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి.ఎక్సరే, సిటీ స్కాన్ ద్వారా ఎముక ఎలా విరిగిందో గుర్తించి చికిత్స అందిస్తారు.
కొన్ని ఫ్యాక్చర్లను సులభంగా స్క్రూలతోనూ సరి చేసే అవకాశం ఉంటుంది.భుజం, బంతి కిలు విరిగితే కృతిమ కిళ్లను అమర్చాల్సి అమరుస్తారు.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నూటికి పదిమందికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే ప్లేట్లు, రాడ్ లు, స్క్రూలు బిగిస్తే సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల తర్వాత తీసేయాల్సి ఉంటుంది.పల్లెటూర్లలో కొంత మంది పసరు, నాటు వైద్యం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది.కాబట్టి ఎముక ఏ మాత్రం పక్కకు జరిగినా ఈ సమస్య జీవితాంతం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.