ఈ ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పండ్లలో కివీ పండు( Kiwi fruit ) ఒకటి.ఖరీదు ఎక్కువైనప్పటికీ.
అందుకు తగ్గ పోషకాలు కివీ పండులో మెండుగా నిండి ఉంటాయి.రోజుకు ఒక కివీ పండును తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
అనేక జబ్బులకు దూరంగా ఉండవచ్చు.అయితే చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే కివీ పండును తొక్క తీసేసి తింటుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే సగం పోషకాలను మీరు కోల్పోతున్నట్లు అవుతుంది.

వాస్తవానికి కివీ పండ్ల లోనే కాదు వాటి తొక్కలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి.విటమిన్ సి, విటమిన్ ఈ, ఫోలేట్, ఫైబర్ తో సహా ఎన్నో విటమిన్లు, ఖనిజాలు కివీ తొక్క కలిగి ఉంటుంది.అలాగే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా కివీ తొక్కలో అధికంగా ఉంటాయి.అందుకే కివీ పండును తొక్కతో పాటుగానే తినాలని నిపుణులు సూచిస్తున్నారు.అయితే తొక్కతో పాటు తినే ముందు కచ్చితంగా కివీ పండును ఉప్పు నీటిలో వేసి శుభ్రంగా కడగాలి.ఆ తర్వాతే తొక్కతో పాటు కివీ పండును తినాలి.
నిత్యం ఒక కివీ పండును తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అద్భుతంగా పెరుగుతుంది.సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.
కంటి చూపు పెరుగుతుంది.కివీ పండులో ఉండే విటమిన్ ఈ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.
వృద్ధాప్య ఛాయలు ( Aged shades )త్వరగా రాకుండా అడ్డుకుంటుంది.

అంతే కాదు తొక్కతో పాటుగా రోజుకో కివీ పండును తీసుకుంటే గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది.బాడీలోని టాక్సిన్స్ దూరం అవుతాయి.వెయిట్ లాస్( Weight loss ) అవుతారు.
రక్తపోటు ( Blood pressure )అదుపులో ఉంటుంది.క్యాన్సర్ కణాలకు చెక్ పెట్టే సామర్థ్యం కూడా కివీ పండుకు ఉంది.
రోజూ కివీ పండును తింటే పలు రకాల క్యాన్సర్లు వచ్చే రిస్క్ సైతం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.