ముఖ్యంగా చెప్పాలంటే మహాలయ అమావాస్య( Mahalaya Amavasya ) రోజును పితృ అమావాస్య, సర్వపితృ అమావాస్య అని కూడా పిలుస్తారు.ఈ రోజును పెద్దల కోసమే కేటాయించారని పండితులు చెబుతున్నారు.
పితృపక్షాల సమయంలో పితృదేవతలు భూమి మీదకు వస్తారని తమ వారిని ఆశీర్వదించి వెళ్తారని చాలామంది ప్రజలు నమ్ముతారు.పితృ అమావాస్య రోజు ఎవరైతే పితృదేవతలను గుర్తుచేసుకొని శార్ద , దాన, తర్పణాలను చేస్తారో వారిపై పితృదేవతుల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెబుతున్నారు.
అక్టోబర్ 14వ తేదీన పితృ అమావాస్య సందర్భంగా అందరూ పితృదేవతల ఆత్మ శాంతికి వారిని గుర్తు చేసుకొని పిండ ప్రదానం ( Pinda pradanam )చేస్తున్నారు.

అయితే సర్వపితృ అమావాస్యగా( Sarvapitru Amavasya )పిలువబడే ఈ రోజున కొన్ని పనులు చేస్తే పితృదేవతలకు ఆగ్రహం వస్తుందని, ఫలితంగా వారి ఆశీస్సులకు బదులు శాపాలు వస్తాయని చెబుతున్నారు.సర్వపితృ అమావాస్య రోజు నిషేధించబడిన పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.సర్వపితృ అమావాస్య రోజు మీ ఇంటికి ఎవరైనా వస్తే వారిని వట్టి చేతులతో పంపకూడదు.
ఇంటికి వచ్చి సహాయం అడిగిన వారిని లేదని తిప్పి పంపించడం దోషంగా పరిగణిస్తారు.సర్వపితృ అమావాస్య రోజు ఇంటికి వచ్చిన పేదవారికి, బ్రాహ్మణులకు, నిస్సాయిలకు, మహిళలకు మీకు ఉన్న దానిలో కొంత ధనం చేయడం మంచిదని చెబుతున్నారు.

అలాగే ఇంటికి వచ్చిన వారికి ఏది ఇవ్వకుండా ఎలాంటి దానం చేయకుండా పంపించకూడదన్న విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.పితృపక్షం చివరి రోజైనా సర్వపితృ అమావాస్య రోజు ఎవరిని అవమానించకూడదు.ఎవరిని ఉద్దేశించి చెడుగా మాట్లాడకూడదు.ఒకవేళ ఎవరినైనా అలా మాట్లాడితే పితృ దేవతలకు ఆగ్రహం వస్తుంది.కాబట్టి పితృ దేవతలకు ఆగ్రహం వచ్చేలా అసలు ప్రవర్తించకూడదు.చాలామంది మహాలయ అమావాస్య రోజు మాంసం, చేపలు( Meat and fish ) వండుకుని తింటూ ఉంటారు.
అయితే మహాలయ అమావాస్య రోజున ఈ పనులు అస్సలు చేయకూడదు.మహాలయ అమావాస్య రోజున వెల్లుల్లి, ఉల్లిపాయలు, మాంసం, చేపలు, గుడ్లు తినకూడదని, అలాగే మద్యపానం చేయకూడదని చెబుతున్నారు.