ప్రతి ఒక్కరినీ మెప్పిస్తున్న ప్రేమా గీమా గీతం

ప్రకటించిన క్షణం నుంచే జనాల్లో క్రేజ్‌ తెచ్చుకున్న సినిమా సింబా – ది ఫారెస్ట్ మ్యాన్‌.జగపతిబాబు, అనసూయ, వశిష్ఠ ఎన్‌ సింహ, కబీర్‌ దుహాన్‌ సింగ్‌, బిగ్‌ బాస్‌ ఫేమ్‌ దివితో పాటు పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.

 Local Love Song Of The Year Prema Geema Enchants Everyone Simbaa, Jagapathi Babu , Anasuya, Vashista N Simha, Simbaa The Forest Man , Murali Manohar , Sampath Nandhi , Prema Geema, Krishna Saurabh, Krishna Prasad-TeluguStop.com

ప్రముఖ దర్శకుడు సంపత్‌ నంది ఈ ఫారెస్ట్ బేస్డ్ డ్రామాకు కథనందించారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌కి అమితమైన స్పందన వచ్చింది.

అప్పటి క్యూరియాసిటీని పెంచేలా మేకర్స్ ప్రేమా గీమా సింగిల్‌ని విడుదల చేశారు.

లోకల్‌ లవ్‌ సాంగ్‌ ఆఫ్ ది ఇయర్‌గా మేకర్స్ ప్రకటించిన ప్రేమా గీమా గీతానికి విశేషమైన స్పందన వస్తోంది.

కృష్ణ సౌరభ్‌ అద్భుతమైన ట్యూన్‌ ఇచ్చారు.నిత్యశ్రీ అంతే హృద్యంగా ఆలపించారు.

మిట్టపల్లి సురేందర్‌ రాసిన పాటలోని మేజికల్‌ లవ్‌ ఫీల్‌ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తున్నారు.ఈ పాటలో దివి అప్పియరెన్స్ మరో రేంజ్‌లో ఉంది.

ఇప్పటికే సింబా – ది ఫారెస్ట్ మ్యాన్‌కి సంబంధించిన అన్ని వివరాలు జనాలను ఆకట్టుకుంటున్నాయి.మురళీ మనోహర్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.అడవి నేపథ్యంలో అంతే అద్భుతంగా ఆకట్టుకునే కథతో తెరకెక్కుతోంది.కృష్ణప్రసాద్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

కృష్ణ సౌరభ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.రాజేందర్‌ రెడ్డి డి, సంపత్‌ నంది ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇంతకు పూర్వం గాలిపటం, పేపర్‌ బోయ్‌ సినిమాలతో నిర్మాతగా సక్సెస్‌ అందుకున్నారు సంపత్‌ నంది.ఆ కోవలో ఇప్పుడు అంతకు మించిన ఇష్టంతో సింబాను రూపొందిస్తున్నారు.

Disclaimer : TeluguStop.com Editorial Team not involved in creation of this article & holds no responsibility for its content.This story is published using press releases provider feed.


తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube