పసుపు చీర కామెంట్లపై.. వైయస్ షర్మిల కౌంటర్..!!

వైసీపీ అధినేత వైయస్ జగన్ ( YS Jagan ) గురువారం పులివెందులలో నామినేషన్ వేయటం తెలిసిందే.ఈ క్రమంలో అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో.

 Ys Sharmila Sensational Comments On Yellow Saree Comments , Ys Sharmila, Congres-TeluguStop.com

పసుపు చీర కట్టుకొని ప్రత్యర్థుల కుట్రల్లో.తన చెల్లెలు భాగస్వాములు అయ్యారని సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై వైయస్ షర్మిల ( YS Sharmila ) స్పందించారు.గురువారం నాడు గుంటూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా జగన్ రెడ్డి వైయస్సార్ వారసుడు కాదు.బీజేపీ వారసుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ సొంత చెల్లెలు అని కూడా చూడకుండా.వేలాది మంది ఉండే సభలో తనపై అబాండాలు మోపారని ఆగ్రహించారు.

తాను వేసుకున్న బట్టల గురించి ప్రస్తావిస్తారా.అని విమర్శించారు.

ఎంత దిగజారుడు రాజకీయాలు.ఏం అవసరం ఉంది.? అని ప్రశ్నించారు.

Telugu Congress, Ys Jagan, Ys Sharmila, Yssharmila-Latest News - Telugu

తాను బాబు దగ్గర మోకరిల్లనని వైసీపీ నాయకులు( YCP leaders ) అంటున్నారు అంటూ షర్మిల సీరియస్ అయ్యారు.ప్రజలకు మేలు చేయాలని అధికారం వస్తే ప్రత్యేక హోదా కోసం ఎందుకు ఉద్యమం చేయలేదని నిలదీశారు.ఐదు సంవత్సరాలలో పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని అన్నారు.

ఐదు సంవత్సరాలుగా.రాజధాని ఎందుకు నిర్మించలేకపోయారని.

నిలదీశారు.రాజశేఖర్ రెడ్డి పేరును కాంగ్రెస్ లేదా సీబీఐ.

చార్జి షీట్ లో చేర్చలేదు అని షాకింగ్ కామెంట్లు చేశారు.సీబీఐ చార్జిషీట్ లో వైయస్సార్ పేరు నమోదు కావటానికి కారణం.

జగన్ లాయర్ సుధాకర్ రెడ్డి అని షర్మిల వ్యాఖ్యానించారు.ఈ ఎన్నికల సమయంలో ప్రజలు.

చంద్రబాబుకి లేదా జగన్ కి ఓటేసిన అది బీజేపీకి పడినట్టే.బీజేపీ పార్టీని అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ఎంత వ్యతిరేకించారో అందరికీ తెలుసు.

బీజేపీ మతతత్వ పార్టీ.వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని షర్మిల సంచలన స్పీచ్ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube