ఏపీలో ఎన్నికలు( Elections in AP ) దగ్గర పడుతున్నాయి.దీంతో కూటమి పార్టీల నేతలు ప్రచారం స్పీడ్ పెంచారు.
గురువారం రాజంపేట, రైల్వే కోడూరులో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు.ఈ క్రమంలో రైల్వే కోడూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకులపై పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
కష్టం మనది…సంపద వైసీపీ నాయకులది అని విమర్శించారు.రాష్ట్రంలో 30 వేల మంది ఆడవాళ్లు కనుమరుగైతే…స్పందించని ప్రభుత్వం.
ఒకరోజు ఢిల్లీలో మిధున్ రెడ్డి ( Midhun Reddy )కనిపించారు.చిత్తూరు జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి రాజకీయాలు చేస్తే ఊరుకోమని చాలా గర్వంగా చెబుతున్నారు.
ఒకరి జోలికి వెళ్లాం… మా నియోజకవర్గాల జోలికొస్తే ఊరుకోం.అని తనతో అన్నారు అంటూ పవన్ వ్యాఖ్యానించారు.
మరి అలాంటప్పుడు పిఠాపురంలో మిథున్ రెడ్డికి పని ఏంటి.? అంటూ.పవన్ ప్రశ్నించారు.రాజకీయాలు నాకు సరదా కాదు.ప్రతి అడ్డమైన వారు విమర్శిస్తుంటే.పౌరుషం లేదనుకుంటున్నారా.? అంటూ.పవన్ మండిపడటం జరిగింది.
రైల్వే కోడూరు( Railway Kodur ) నుండి చెబుతున్న.ఒక్కొక్క వైసీపీ గుండాలను విడిచిపెట్టే ప్రసక్తే లేదు.
రాబోయే రోజుల్లో వీధుల్లోకి లాక్కొస్తాం.సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంతమంది యువత ఉన్నారు.మీరు ధైర్యంగా రోడ్లపైకి వస్తే… ఈ గుండాలు.
రోడ్లు మీద తిరగగలరా.? అంటూ సెంచలన వ్యాఖ్యలు చేశారు.ధైర్యం లేని సమాజం… కుళ్లిపోయి చచ్చిపోతుంది.ఇది రాయలసీమ ప్రాంతం.సీమ ప్రజలైన మీరు ఎందుకు భయపడుతున్నారు అంటూ ఉద్వేగ భరితంగా ప్రసంగించారు.