కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు డాలి ధనంజయ( Daali Dhananjaya ) ఒకరు.ఈయన ఎన్నో కన్నడ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
అయితే తెలుగులో మాత్రం సుకుమార్ ( Sukumar ) దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప ( Pushpa ) సినిమాలో జాలిరెడ్డి ( Jolly Reddy ) పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఈ సినిమా తర్వాత ఈయనకు తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ లభించింది.
ఇలా నటుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న జాలిరెడ్డి తాజాగా డాక్టరమ్మతో కలిసి పెళ్లి పీటలు ఎక్కారు.

డాలీ ధనుంజయ నేడు డాక్టర్ ధన్యత ( Dr.Dhanyatha ) తో కలిసి ఏడడుగులు నడిచారు.మైసూర్ వేదికగా వీరి వివాహం అట్టహాసంగా జరిగింది.
ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇరు కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు, సన్నిహితులు, సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు అయితే వీరి వివాహ రిసెప్షన్లో భాగంగా సుకుమార్ కూడా హాజరై సందడి చేసిన విషయం తెలిసిందే.

ఇక ధనుంజయ ధన్యత ఇద్దరికీ మైసూర్ అంటే ఎంతో ఇష్టం వీరిద్దరూ మొదటిసారి ఇక్కడే కలుసుకున్న నేపథ్యంలో వారి పెళ్లిను కూడా అక్కడే జరుపుకున్నారు.ఈ సందర్భంగా టెంపుల్ థీమ్‌లో వివాహ వేదికను అందంగా ముస్తాబు చేశారు.ఎంతో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది అయితే వీరిద్దరూ గత ఏడాది నవంబర్ నెలలోనే నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే.ఇక నేడు పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.