దీపావళి( Diwali ) అంటే అజ్ఞానం అనే చీకటి నుండి విజ్ఞానం అనే వెలుగులోకి పైనుంచి జీవితంలో కొత్త అర్థాలు వెతుక్కోవాలన్నది దీపావళి పండుగ ఉద్దేశం.అయితే దీపం ఐశ్వర్యం అయితే, అంధకారం దారిద్రం.
దీపం ఉన్నచోట జ్ఞానం, సంపద ఉంటుంది.అయితే దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి( Goddess Lakshmi ) .దీపావళి నాడు దీపలక్ష్మి తన కిరణాలతో జగత్తునంతటిని కాంతిమయం చేస్తుంది.దీపలక్ష్మికి దీపావళి నాడు భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తే సకల, సంపదలు లభిస్తాయి.
అయితే దీపం జ్ఞానానికి ప్రతీక.ఏ శుభకారం జరిగే ముందైనా సరే జ్యోతి ప్రజ్వలనం చేయడం చాలా సాంప్రదాయంగా నడుస్తూ ఉంది.
దీపకాంతి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకగా పేర్కొన్నారు.అయితే దీపంలో కనిపించే ఎర్రని కాంతి ఈ సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుడికి, నీలి కాంతి విష్ణు భగవానుకి, తెల్లని కాంతి పరమశివుడికి ప్రతినిధులను చెబుతారు.
అయితే జనసామాన్యంలో నరకాసుర సంహార గాథ, బలి చక్రవర్తి రాజ్యదానం, విక్రమార్కుడి పట్టాభిషేకంతో దీపావళి ముడిపడి ఉంది.ఉత్తర భారతంలో చతుర్దశికి ముందు రోజు దీపావళి ఐదు రోజుల పండుగ అయింది.
ఇకపోతే ధన త్రయోదశి, నరక చతుర్దశి( Dhana Triodashi, Naraka Chaturdashi ), దీపావళి బలిపాడ్యమి, యమద్వితీయ ఇలా మొత్తం ఐదు రోజులుగా వరుసగా దీపావళి పండుగను జరుపుకుంటారు.అయితే రావణ సంహారానంతరం రాముడు అయోధ్య చేరుకొని భరతుడిని దీపావలి రోజునే కలిశారని ఒక నమ్మకం.దాన్ని భరత్ మిలాద్ పేరుతో కూడా జరుపుకోవడం జరుగుతుంది.ఇక దీపావళి దేశమంటతా ఎనలేని ప్రాధాన్యతను కనిపిస్తుంది.ఇక రావణాసురునితో జరిపిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సతీసమేతంగా అయోధ్యకు వెళ్తాడు.ఆ రోజున అమావాస్య.
అయోధ్య అంత చీకటితో ఉండడం వలన శ్రీరామునికి స్వాగతం పలికేందుకు అయోధ్య వాసులందరూ కలిసి దీపాలను వెలిగించారు.అమావాస్యలో చీకటిని పారద్రోలెందుకు ఈ విధంగా దీపావళిని మనం జరుపుకుంటున్నాం.
DEVOTIONAL