అది ఈనెల అయినా, సంవత్సవం అయినా సరే, 17వ తేదీన పుట్టారంటే, సంఖ్యా శాస్త్రం ప్రకారం వారి బలం, బలహీనతలు, లక్షణాలు, వారి పరిస్థితి ఎలా ఉంటోందో ఇప్పుడు తెల్సుకుందాం.ఒకటికి అధిపతి సూర్యడు, 7కి కేతువు అధిపతి మొత్తం కలిపితే 8కి శని అధిపతి వెరసి 17వ తేదీన జన్మించిన వారిపై ఈ మూడు గ్రహాల ప్రభావం ఉంటుందని సంఖ్య శాస్త్ర నిపుణులు చెప్పేమాట.
అయితే
శనిగ్రహ ప్రభావం కొంచెం అధికంగా ఉంటుంది.శని గ్రహం అంటే భయపడతారు గానీ
నిజానికి శని అంతటి మంచి గ్రహం మరొకటి లేదని కూడా సంఖ్యా శాస్త్ర
నిపుణులు చెబుతున్నారు.

నిజానికి శనికి భగవంతుడు కర్మాది పత్యం ఇచ్చాడు.మనం చేసే తప్పొప్పుల్లో మనల్ని శిక్షించే అధికారం శనికి దఖలు పరిచాడన్నమాట.మనం ఈ జన్మలో కావచ్చు, గత జన్మలో కావచ్చు చేసిన తప్పులుంటే శని శిక్షిస్తాడు.మంచి చేస్తే ఏమీ జరగదు.నవగ్రహాల్లో నిదానంగా గ్రహించే గ్రహం, అందుచేత విజయాలు నెమ్మదిగా వస్తాయి.ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది.
అంతతేలిగ్గా విజయం రాదు.

అయితే, సునాయాసంగా కంటే , కష్టపడడం వలన వచ్చే విజయం ఎక్కువకాలం నిలబడడానికి దోహదం అవుతుందని గ్రహించాలి.ఒక స్థాయికి చేరుకున్నాక పదిలంగా వుంటారు.చిన్నవయసులో ఎక్కువ కష్టం ఉంటుంది.
వయస్సు పెరిగే కొద్దీ శని గ్రహ ప్రభావం కూడా పెరిగి, మంచి చేస్తాడు.మొత్తమ్మీద ఈ తేదీన జన్మించిన వాళ్ళు ఓ స్థాయికి వచ్చాక ఎలాంటి ఇబ్బందినైనా తట్టుకుంటారు.
సముద్రునిగా పైకి ప్రశాంతంగా వుంటారు.తరచూ వృత్తి, ఉద్యోగం మార్చకూడదు.
శని గ్రహ అనుగ్రహం కోసం శనివారం నియమాలు పాటించడం,సుందరకాండ పారాయణ చేయడం, ఆంజనేయుని పూజించడం చేయాలి.