హిందూ ధర్మం ప్రకారం లక్ష్మీదేవిని సంపద యొక్క దేవతగా పిలుస్తూ ఉంటారు.లక్ష్మీదేవి ఎవరి పై దయ చూపుతుందో వారి జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఉండవు.
మరోవైపు లక్ష్మీదేవి( Lakshmi devi ) దయ లేకుంటే ఆ వ్యక్తి ఎన్నో ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.అందుకే ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి ఆశీస్సులు తమ పై ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ ఉంటారు.
కొన్నిసార్లు అదృష్టం లేకపోవడం వల్ల కొందరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేకపోవచ్చు.శాస్త్రాల ప్రకారం జ్యోతిష్య శాస్త్రంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మరియు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి అనేక చర్యలు ఉన్నాయి.

ఈ చర్యలు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహన్ని పొందవచ్చు.లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని సంకేతాలు కూడా జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు.ఒక వ్యక్తి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించినప్పుడు డబ్బు రాక కచ్చితంగా మొదలవుతుంది.అయితే లక్ష్మీదేవి ప్రవేశించే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి.దాంతో త్వరలో డబ్బుల వర్షం కురుస్తుందని అర్థం చేసుకోవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే విష్ణు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి పూజలో శంఖం ఉపయోగిస్తారు.
ఒక వ్యక్తి ఉదయం నిద్ర లేచిన తర్వాత శంఖం శబ్దం వింటే అది శుభ సూచకం.

ఇది లక్ష్మీదేవి రాకకు సంకేతంగా భావిస్తూ ఉంటారు.గ్రంధాల ప్రకారం గుడ్లగూబ( Owl )ను లక్ష్మీదేవి వాహనం అని పిలుస్తూ ఉంటారు.అందుకే గుడ్లగూబను చూడడం శుభసంకేతకంగా పరిగణిస్తారు.
అంటే లక్ష్మీదేవి రాకముందే తన రాక గురించి మీకు తెలియజేస్తుంది.ఇంటి చుట్టూ గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీపై దయ చూపుతుందని అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యంగా చెప్పాలంటే చీపురు లక్ష్మీదేవి రూపంగా చాలామంది భావిస్తారు.చీపురుకు సంబంధించిన కొన్ని విషయాలను మనసులో ఉంచుకుంటే లక్ష్మీదేవి దీవెనలు భక్తులపై ఉంటాయి.
ఎవరైనా ఉదయం ఊడ్చడం చూస్తే అది కూడా శుభసంకేతంగా పరిగణిస్తారు.జ్యోతిష్య శాస్త్రం( Astrology )లో పామును చూడడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు.
ఒక వ్యక్తి పామును చూస్తే అది లక్ష్మీదేవి రాకకు ప్రతీక.కలలో పాము లేదా బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి డబ్బు వస్తుందని అర్థం చేసుకోవచ్చు.