భీముడు ప్రతిష్టించిన ఆలయంగా ప్రకృతి ఒడిలో దట్టమైన అడవి కొండల మధ్య బండరాళ్లపైన కొలువు దీరిన ఆలయంగా సంతాయిపేట భీమేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది.అందుకే ఈ దేవాలయాన్ని భీమేశ్వరాలయం అని అంటారు.
మండలంలోని సంతాయిపేట గ్రామ పరిధిలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భీమేశ్వర ఆలయం ఎంతో విశిష్టతలు కలిగి ఉంది.శివుడు పంచముకుడిగా దర్శనమిస్తూ ప్రత్యేకంగా పూజలు చేసినా తర్వాత భక్తులే స్వయంగా శివలింగానికి నీళ్లతో అభిషేకం చేస్తారు.
భీమేశ్వరుని దర్శించుకోవాలంటే వాగు దాటుకుని వెళ్ళవలసి ఉంటుంది.అంటే దేవునీ ఈ దర్శనాన్ని కంటే ముందు సహజంగానే పాదాలు శుభ్రం అవుతాయి.
ఈ భీమేశ్వర వాగులో మాఘ స్నానాలు, కార్తీక స్నానాలు, శ్రావణాలు చేసినట్లయితే చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు పారే వాగు మధ్యలో భీమేశ్వరాలయం ఉంది.
అందుకే ఈ వాగును దక్షిణ గంగ అని కూడా అంటారు.
కాకతీయులు నిర్మించిన ఈ దేవాలయానికి ఉత్తర ద్వారం ముఖం ఉంటుంది.
కానీ ఈ భీమేశ్వర ఆయనకి పడమర ముఖ ద్వారం ఉండడం విశేషం.దేశంలో ఎక్కడా లేని విధంగా భీమేశ్వర దేవాలయంలో కుంతిదేవి విగ్రహం ఉంది.
సంతాన భాగ్యం లేని వారు కుంతీ దేవికి పూజలు చేస్తే సంతానం కలుగుతుందని చాలామంది భక్తులు నమ్ముతారు.ఈ దేవాలయానికి ప్రక్కన ఎమకొండం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు.
ఆలయంలో ప్రతి సంవత్సరం బాగా అమావాస్య, శివరాత్రి మహోత్సవం సందర్భంగా విశేష పూజలకు అభిషేకాలు నిర్వహిస్తారు.

కాకతీయులు 12వ శతాబ్దంలో భీమేశ్వర దేవాలయం నిర్మించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి.భీమేశ్వర దేవాలయంలోకి వెళ్లగానే ముందుగా మహానంది దర్శనమిస్తుంది.ఈ మహానంది ప్రతి సంవత్సరం ఒక అర ఇంచు పెరుగుతుందని భక్తులు చెబుతున్నారు.