బాల రాముడి విగ్రహా ప్రాణప్రతిష్టకు సుముహూర్తం 84 సెకండ్లే..!

అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహా ప్రాణప్రతిష్ట( Ram Mandir Pran Pratishtha ) కార్యక్రమం మరికాసేపట్లో జరగనుంది.ఈ కార్యక్రమానికి సుముహూర్తం కేవలం 84 సెకండ్ల పాటు ఉండనుంది.మధ్యాహ్నం 12.29 గంటల మూడు సెకన్ల నుంచి 12.30 గంటల 35 సెకండ్ల వరకు అభిజిత్ ముహుర్తంలో బాల రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.ఆచార్య గణేశ్వర్ ద్రవిడ్, ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ ఆధ్వర్యంలో 121 మంది పండితులు ఈ క్రతువును నిర్వహించనున్నారు.

 The Life Span Of The Statue Of Bala Rama Is Only 84 Seconds..! , Ayodhya,  Ram M-TeluguStop.com

అలాగే 150 కి పైగా సంప్రదాయాలు, యాభైకి పైగా గిరిజన, తీర్థ, ద్వీపం, తదితర సంప్రదాయాలకు చెందిన సాధువులు, ప్రముఖులు హాజరుకానున్నారు.కాగా ఈ కార్యక్రమంలో పాల్లొనేందుకు ప్రధాని మోదీ( Narendra Modi ) ఢిల్లీ నుంచి మరి కాసేపట్లో అయోధ్యకు చేరుకోనున్నారు.కాగా ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో 150 మంది సాధువులు, మత గురువులు, 50 మంది ఆదివాసీ తెగలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు.ప్రాణప్రతిష్ట కార్యక్రమం అనంతరం అతిథులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube