జుట్టు కుదుళ్లు బలహీనంగా ఉంటేహెయిర్ పాల్ సమస్య చాలా అధికంగా ఉంటుంది.మరియు హెయిర్ గ్రోత్ కూడా సరగ్గా ఉండదు.
అందుకు జుట్టు కుద్దళ్లను బలంగా మార్చుకోవడం ఎంతో అవసరం.కేవలం ఖరీదైన నూనెలు, షాంపూలు వాడినంత మాత్రాన కుదుళ్లు బలంగా మారవు.
దాంతో ఏం చేయాలి.? ఎలాంటి టిప్స్ పాటిస్తే జుట్టు కుదుళ్లు దృఢంగా మారతాయి ? అన్న ప్రశ్నలతో తెగ సతమతమవుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని సింపుల్ & బెస్ట్ టిప్స్‌ను పాటిస్తే సులభంగా మీ సమస్యకు పరిష్కారాన్ని పొందొచ్చు.మరి ఆ టిప్స్ ఏంటో చూసేయండి.
ముందుగా ఒక గిన్నెలో ఐదారు స్పూన్ల పెరుగు, ఒక స్పూన్ ఆముదం, ఒక స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి అర గంట పాటు వదిలేయాలి.
అనంతరం కెమికల్స్ తక్కువగా ఉండే షాంపూతో హెడ్ బాత్ చేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే బలహీనమైన కుదుళ్లు బలంగా మారతాయి.
దాంతో జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.

అలాగే ఒక గిన్నెలో మూడు స్పూన్ల ఆమ్లా పౌడర్, రెండు స్పూన్ల షికాకాయ్ పౌడర్, తగినన్ని వాటర్ పోసుకుని కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి ముప్పై లేదా నలబై నిమిషాల అనంతరం గోరు వెచ్చని నీటితో హెడ్ బాత్ చేయాలి.ఇలా చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.
ఇక ఈ టిప్స్‌తో పాటు డైలీ డైట్లో ఐరన్, జింక్, సెలీనియం మొదలైన మినరల్స్‌తో పాటు ప్రోటీన్, విటమిన్ డి వంటి పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి.తద్వారా మంచి పోషణ అంది జుట్టు కుదుళ్లు దృఢపడతాయి.
మరియు కంటి నిండా నిద్రపోవడం, ఎలక్ట్రానిక్ గడ్జెట్స్కు దూరంగా ఉండటం, మద్యపానం, ధూమపానం అలవాట్లను మానుకోవడం చేయాలి.