అతిలోక సుందరి శ్రీదేవి డ్యూయల్ రోల్ చేసి అదరగొట్టిన 9 సినిమాలు ఇవే... 

గ్లోబల్ బ్యూటీ అయిన శ్రీదేవి( Sridevi ) సౌత్ ఇండియన్, బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో ఐకానిక్ సూపర్ స్టార్‌గా స్థిరపడింది.బాలనటి నుంచి అగ్రకథానాయికగా ఎదిగిన ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకం.

 Sridevi Dual Role Movies , Sridevi, Angikaram, Vanakkatukkuriya Kadaliye , Mosag-TeluguStop.com

ఆమె గ్లామర్ పాత్రలలో మాత్రమే కాకుండా, చాలెంజింగ్ రూల్స్ చేసి తరువాతి తరం తారలపై శాశ్వత ప్రభావాన్ని చూపింది.ద్విపాత్రాభినయంలో అద్భుతమైన నటనతో శ్రీదేవి చాలామందిని ఆకట్టుకుంది.

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తొమ్మిది చిత్రాలలో ఆమె డ్యూయల్ రోల్స్ చేసి తన అపారమైన ప్రతిభను ప్రదర్శించింది.ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా డ్యూయల్ రియల్ చేసిన సినిమాలేవో తెలుసుకుందాం.

1.“అంగీకారం” (1977): ఈ మలయాళ చిత్రంతోనే శ్రీదేవి తొలిసారి ద్విపాత్రాభినయం చేసింది.ఆమె సతీ, విజి అనే తల్లి, కుమార్తె రోల్స్‌లో నటించింది.

Telugu Angikaram, Banjaran, Baz, Guru, Gurudev, Khudha Gawa, Lamhe, Mosagadu, Sr

2.“వనక్కతుక్కురియ కడలియే” ( Vanakkatukkuriya Kadaliye ) (1978): రజనీకాంత్, విజయ్ కుమార్‌లతో కూడిన ఈ తమిళ చిత్రంలో శ్రీదేవి సోదరీమణులు శాంతి, జెన్నీ పాత్రలను పోషించింది.

Telugu Angikaram, Banjaran, Baz, Guru, Gurudev, Khudha Gawa, Lamhe, Mosagadu, Sr

3. “మోసగాడు”( mosagadu ) (1980): కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, చిరంజీవి సరసన శ్రీదేవి సీత, గీత అనే సోదరీమణులుగా నటించింది.

4.“గురు”( guru ) (1989): బాలీవుడ్ మూవీ”గురు”లో మిథున్ చక్రవర్తితో కలిసి, శ్రీదేవి రమ, ఉమగా రెండు విభిన్నమైన పాత్రలను అద్భుతంగా పోషించి అందరి చేత ప్రశంసలు అందుతుంది.

5. “చాల్ బాజ్”( Chall Baz ) (1989): ఈ హిందీ చిత్రం శ్రీదేవికి ఉత్తమ నటిగా మొదటి ‘ఫిల్మ్‌ఫేర్’ అవార్డును సంపాదించిపెట్టింది.ఆమె సన్నీ డియోల్, రజనీకాంత్‌లతో కలిసి అంజు, మంజు అనే కవలల వేషాల్లో కనిపించింది.

Telugu Angikaram, Banjaran, Baz, Guru, Gurudev, Khudha Gawa, Lamhe, Mosagadu, Sr

6.“లమ్హే”( Lamhe ) (1991): ఈ క్లాసిక్ బాలీవుడ్ చిత్రంలో శ్రీదేవి పల్లవి, పూజగా తల్లి-కూతురు పాత్రలను చాలా చక్కగా పోషించి చప్పట్లు కొట్టించుకుంది.

7.“బంజారన్”( Banjaran ) (1991): శ్రీదేవి పునర్జన్మ నేపథ్య తెరకెక్కిన ఈ చిత్రంలో రిషి కపూర్‌తో కలిసి రేష్మ, దేవి అనే రెండు కాలాలకు చెందిన పాత్రలను పోషించింది.

Telugu Angikaram, Banjaran, Baz, Guru, Gurudev, Khudha Gawa, Lamhe, Mosagadu, Sr

8.“ఖుదా గవా”( khudha gawa ) (1992): ఈ బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో అమితాబ్ బచ్చన్, నాగార్జునతో కలిసి శ్రీదేవి బెనజీర్, మెహందీ అనే తల్లీకూతుళ్ల జంటగా మెస్మరైజ్ చేసింది.

9.“గురుదేవ్”( Gurudev ) (1993): రిషి కపూర్, అనిల్ కపూర్ నటించిన ఈ హిందీ చిత్రంలో శ్రీదేవి ప్రియ, సునీతగా ద్విపాత్రాభినయం చేసింది.

Telugu Angikaram, Banjaran, Baz, Guru, Gurudev, Khudha Gawa, Lamhe, Mosagadu, Sr

సినిమా ప్రపంచానికి శ్రీదేవి అందించిన సేవలు నిజంగా విశేషమైనవి, ద్విపాత్రాభినయంలో ఆమె రాణించిన తీరు నటిగా ఆమె అసాధారణ ప్రతిభను అందరికీ పరిచయం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube