లియాండర్ పేస్. భారత టెన్నిస్ దిగ్గజం.
ఎన్నో అంతర్జాతీయ టోర్నమెంట్లు ఆడి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చాడు.భారత్ లో క్రికెట్ ను తట్టుకుని టెన్నిస్ ఓ స్థాయి గుర్తింపు తెచ్చేలా చేశాడు.
సింగిల్స్ తో పాటు డబుల్స్ లోనూ చక్కటి ఆట తీరు కనబర్చాడు.పదుల సంఖ్యలో అంతర్జాతీయ మెడల్స్ ను దేశానికి అందించాడు.
తాజాగా ఆయన ఓ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నట్లు బయటపడింది.ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఈ విషయం ఎలా బయట పడింది? అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.
ఖడ్గం సినిమాతో తెలుగ తెరకు పరిచయం అయిన నటి కిమ్ శర్మ. గడిచిన కొంత కాలంగా వీరిద్దరు డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపించాయి.గతంలో ఓసారి ఇద్దరు కలిసి కెమెరాకు చిక్కినా పెద్దగా స్పందించలేదు.తాజాగా లాక్ డౌన్ ఎత్తివేశాక.
ఈ ఇద్దరు గోవాలో సరదాగా గడిపేందుకు వెళ్లారు.అయితే వారు ఉన్న హోటల్ ఇన్ స్టా గ్రామ్ నుంచి వీరిద్దరు క్లోజ్ గా ఉన్న ఫోటోలు లీక్ అయ్యాయి.
దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.ఈ ఫోటోల్లో ఒకదాంటో ఇద్దరు కలిసి మీల్స్ తీసుకుంటండగా.
మరొక ఫోటోలో కిమ్ శర్మను పేస్ ప్రేమగా హగ్ చేసుకున్నాడు.
అయితే కిమ్ శర్మ, లియాండర్ పేస్ మాత్రం తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఈ టూర్ కు సంబంధించి ఎలా ఫోటోలను షేర్ చేయలేదు.కానీ కిమ్ శర్మ మాత్రం తన సింగిల్ ఫోటోను అప్ లోడ్ చేసింది.మిస్టర్ పి కి ఈ క్రెడిట్ దక్కుతుందని క్యాప్షన్ పెట్టింది.
అయితే ఈ డ్రెస్ లో ఉన్న పిక్.హోటల్ వాళ్లు షేర్ చేసిన పిక్ సేమ్ డ్రెస్ లో ఉన్నాయి.
దీంతో ఇంతకాలం సీక్రెట్ గా కొనసాగిన వీరి ప్రేమాయణం తొలిసారి అఫీషియల్ గా బయటపడింది.దీనిపై వీరిద్దరు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.