ఒక కొత్త ఆవిష్కరణ చైనా( China ) ఎంత త్వరగా చేయగలదో అందరికీ తెలిసిందే.ముఖ్యంగా విభిన్నమైన వస్తువులను తయారు చేయడంలో చైనా దేశం ప్రత్యేకతను కలిగి ఉంది.
తాజాగా, అక్కడ రూపొందిన ఓ యంత్రం నెట్టింట వైరల్‌గా మారింది.ఈ యంత్రం గుడ్డు( Egg ) వేయగానే క్షణాల్లో ఆమ్లెట్( Omelette ) తయారుచేసి అందించేస్తోంది.
దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
చైనా అంటే సరికొత్త ఉత్పత్తులకు నెలవు.ఎలాంటి వస్తువైనా అచ్చు గుద్దినట్లు తయారు చేయగలిగే శక్తి అక్కడి కంపెనీలకు ఉంది.ప్రముఖ అమెరికన్ బ్రాండ్ అయిన ఆపిల్ తన ఐఫోన్ సిరీస్‌ను విడుదల చేస్తే, దాని నకిలీ మోడల్ చైనాలో చాలా తక్కువ ధరకు లభిస్తుంది.
అసలైన ఆపిల్ ఫోన్ లక్షల్లో అయితే, చైనాలో తయారైన అదే ఫోన్ వేలల్లో దొరుకుతుంది.కానీ, దాని నాణ్యతపై మాత్రం ఎటువంటి హామీ ఉండదు.ఇదే విధంగా నాణ్యమైన బ్రాండెడ్ ఉత్పత్తులను కాపీ చేసి చౌకగా విక్రయించడం చైనా వ్యాపార ధోరణిగా మారింది.
ఇకపోతే, భోజన సమయంలో వేడివేడి ఆమ్లెట్ తినాలని చాలామందికి ఇష్టమే.అయితే దాన్ని చేయడం కొంతమందికి భారంగా అనిపించవచ్చు.ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని చైనా శాస్త్రవేత్తలు ఒక కొత్త యంత్రాన్ని రూపొందించారు.
ఈ యంత్రంలో గుడ్డు వేయగానే క్షణాల్లోనే ఆమ్లెట్ తయారవుతుంది.దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ కొత్త యంత్రంలో గుడ్డు పోయగానే, అది తక్షణమే పగిలి, వేడెక్కిన ఉపరితలంపై పడి, క్షణాల్లోనే ఆమ్లెట్‌గా మారిపోతుంది.అయితే, ఈ యంత్రం ద్వారా తయారైన ఆమ్లెట్‌లో ఉల్లిపాయ, కొత్తిమీర, అల్లం, కారం వంటి మసాలా పదార్థాలు ఉండవు.కేవలం గుడ్డు మాత్రమే కాల్చబడుతుంది.భవిష్యత్తులో దీనిని మరింత అభివృద్ధి చేసి, రుచికరమైన ఆమ్లెట్ అందించే విధంగా మారుస్తామని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ యంత్రం పనిచేసే విధానాన్ని చూపించే వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.గుడ్డును వేయగానే ఆమ్లెట్ బయటకు వస్తుంది.
ఇదేదో బలే ఉంది అంటూ నెటిజన్లు ఆశ్చర్యపడుతున్నారు.అయితే, ఇది నిజంగా ఎంతవరకు ప్రయోజనకరం? మన వంటింట్లో ఉపయోగించుకోవచ్చా? వంటి అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.