ఖర్జూరాలుఎంత అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అయితే రుచిలోనే కాదు.
కాల్షియం, పొటాషియం, ఐరన్, ఫాస్పరస్, జింక్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, కార్బొహైడ్రేట్స్, విటమిన్ ఎ, విటిమన్ బి1, విటమిన్ బి6, విటమిన్ బి3, విటమిన్ కె ఇలా ఎన్నో పోషకాలను సైతం కలిగి ఉంటాయి.అందుకే ఖర్జూరాలు ఎన్నో జబ్బులను నివారిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
అయితే హెల్త్‌కు ఎంత మేలు చేసినప్పటికీ వీటిని అధికంగా తీసుకోరాదు.అలా తీసుకుంటే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ముఖ్యంగా దంతాల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.నిజానికి దంతాలను బలోపేతం చేయడానికి ఖర్జూరాలు ఎంతగానో సహాయపడతాయి.
అలా అని ఎక్కువగా తీసుకుంటే మాత్రం.వాటిలో ఉండే కార్బోహైడ్రేట్స్ మరియు షుగర్స్ దంత క్షయానికి గురయ్యేలా చేస్తాయి.
దాంతో మీ దంతాలు బలహీనంగా మారిపోతాయి.

అలాగే ఊపిరి తిత్తుల సమస్యలు ఉన్న వారు ఖర్జూరాలను చాలా లిమిట్‌గా తీసుకోవాలి.లేదంటే ఊపిరి ఆడకపోవడం, ఛాతిలో అసౌకర్యం, నొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఖర్జూరాల్లో పొటాషియం అధికంగా ఉంటుంది.
అందు వల్ల, వీటిని ఓవర్‌గా తీసుకుంటే తీవ్ర అలసట, వికారం, కళ్లు తిరగడం, వాంతులు వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.

బరువు తగ్గించడంలో ఖర్జూరాలు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతుంటారు.అది నిజమే.కానీ, పరిమితికి మించి ఖర్జూరాలను తీసుకుంటే.
బరువు తగ్గడం కాదు పెరుగుతారు.ఎందుకంటే, ఖర్జూరాల్లో బోలెడన్ని పోషకాలతో పాటుగా కేలరీలు కూడా అధికంగానే ఉంటాయి.
ఇక ఖర్జూరాలను అతిగా తీసుకోవడం వల్ల పొత్తి కడుపు నొప్పి, గ్యాస్, విరేచనాలు, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటివి జరుగుతూ ఉంటాయి.కాబట్టి, ఇకపై రుచిగా ఉన్నాయనో, ఆరోగ్యానికి మంచివనో చెప్పి అతిగా మాత్రం ఖర్జూరాలను తీసుకోకండి.
అతి మీ ఆరోగ్యానికే ముప్పుగా మారుతు జాగ్రత్త!!
.