చూడటానికి అందంగా, తినేందుకు రుచిగా ఉండే స్ట్రాబెర్రీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు.ఎన్నో జబ్బులను నివారిస్తాయి.
ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి.అందుకే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ వీటిని అమితంగా ఇష్టపడి తింటుంటారు.
అయితే ఆరోగ్యానికి కాదు శిరోజాల సంరక్షణలోనూ స్ట్రాబెర్రీలు గ్రేట్‌గా సహాయపడతాయి.ముఖ్యంగా కొందరు తమ జుట్టు పొడి బారిపోయిందని, కాంతిహీనంగా కనిపిస్తుందని తెగ ఫీల్ అయిపోతుంటారు.
అయితే పొడిబారిన జుట్టు స్మూత్ అండ్ సిల్కీగా మార్చడంలో స్ట్రాబెర్రీలు మీకు సూపర్‌గా ఉపయోగపడతాయి.స్ట్రాబెర్రీల్లో ఇతర పోషకాలతో పాటుగా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఇవి రసాయనాలు, కాలుష్యం ప్రభావం నుంచి జుట్టును కాపాడతాయి.అలాగే స్ట్రాబెర్రీల్లో ఉండే కొల్లాజెన్ జుట్టును పొడిబారకుండా అడ్డుకట్ట వేస్తుంది.
మరి శిరోజాలకు స్ట్రాబెర్రీలను ఎలా యూజ్ చేయాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందు రెండు, మూడు స్ట్రాబెర్రీలను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కొబ్బరి నూనె, ఒక స్పూన్ పెరుగు, ఒక ఎగ్ వైట్ వేసుకుని కలుపుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు మొదళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి గంట అనంతరం గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.ఇలా రెండు సార్లు ఇలా చేస్తే జుట్టు స్మూత్ అండ్ సిల్కీగా మారుతుంది.
మరియు జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలు పరార్ అవుతాయి.
అలాగే స్ట్రాబెర్రీలతో మరో అద్భుతమైన హెయిర్ ప్యాక్ ఏంటంటే.మూడు, నాలుగు స్ట్రాబెర్రీ పండ్లను మెత్తగా పేస్ట్ చేసి అందులో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, రెండు స్పూన్ల పెరుగు వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి అప్లై చేసి నలబై నిమిషాల తర్వాత హెడ్ బాత్ చేయాలి.
ఇలా చేసినా కూడా జుట్టు స్మూత్ అండ్ సిల్కీగా మారుతుంది.ఈ హెయిర్ ప్యాక్ వల్ల హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది.