టిడిపి పెట్టిన పేర్లన్నీ మార్చుకుంటూ తమ పార్టీ పేర్లు పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు జగన్.టిడిపి ఎంత మొత్తుకున్నా నేను చేసేది చేస్తాను అన్న విధంగా ముందుకు సాగుతున్నారు.
ఇటీవలే ఏకంగా హెల్తీ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పీకి పారేసి.వైఎస్సార్ పేరును కూడా పెట్టి మరో అడుగు ముందుకేశాడు అని చెప్పాలి.
ఇంకేముంది ఏపీ రాజకీయాల్లో ఇదో సంచలనంగా మారిపోయింది.టిడిపి శ్రేణులు అందరూ కూడా జగన్.
మీకు ఎంత ధైర్యం. ఎన్టీఆర్ పేరునే తొలగిస్తారా.
పేర్లు మార్చుకొని అదే అభివృద్ధి అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారా అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు.

చోటామోటా నేతలు దగ్గర నుంచి ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వరకు అందరూ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.ఇలా అందరూ విమర్శలు గుప్పించాల్సిందే.ఎందుకంటే ఇది వారికి రాజకీయ ప్రయోజనం తెచ్చిపెడుతుంది.
ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ కన్నవాళ్ళు వారికి పుట్టినవారు చాలామంది ఉన్నారు.ఇలా ఒక సమూహమే ఉంది అని చెప్పాలి.
కానీ ఇప్పటివరకు ఎన్టీఆర్ కుటుంబం నుంచి స్పందించిన వారు చాలా తక్కువ.ఇటీవలే ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ తాత పేరు తొలగించటం ఏంటి అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నట్లు ఒక పోస్టు పెట్టాడు.

మరి మిగతా వాళ్ల సంగతేంటి.బిజెపి లో ఉన్న పురందేశ్వరి ఇప్పటి వరకు నోరు మెదపలేదు.ఎన్టీఆర్ కొడుకు టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ పెద్దగా రియాక్ట్ అయ్యింది లేదు.వీరందరినీ పక్కనపెడితే కుటుంబాన్ని ఎదిరించి మరి లక్ష్మీపార్వతిని

రెండో పెళ్లి చేసుకుని పెద్ద త్యాగమే చేసాడు ఎన్టీఆర్.మరి ఇప్పుడు ఎన్టీఆర్ కు ఇంత అవమానకరమైన ఘటన జరిగితే ఎన్టీఆర్ తన వాడు అంటూ పోరాడిన లక్ష్మీపార్వతి సైతం నోరు విప్పలేదు.కారణం ఎదురు మాట్లాడితే పదవి పోతుందని భయమా లేక పోతే ఎన్టీఆర్ ఆమె కోసం చేసిన త్యాగాన్ని మరిచిపోయిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇలా హెల్త్ యూనివర్సిటీ కి ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెడితే ఏకంగా సొంత కుటుంబ సభ్యులే సైలెంట్ గా ఉన్నారు అంటే జగన్ నిర్ణయాన్ని ఆమోదిస్తున్నారేమో అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి అని చెప్పాలి.