జేడీ చక్రవర్తి.ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో.
శివ లాంటి సినిమాలో నటించి యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న వ్యక్తి.ఈయనకు దర్శకుడు తేజకు కెరీర్ తొలినాళ్లలో ఒకరిపై మరొకరికి ఎలాంటి అభిప్రాయం ఉండేది.? ఇద్దరు మిత్రులు ఎలా అయ్యారు? అనే విషయాలను తాజాగా జేడీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.ముందు మనస్పర్దలతో మొదలైనా.
ఆ తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ అయినట్లు చెప్పాడు.
అవి శివ సినిమా రోజులు.
వర్మ టీంలోనే జేడీ చక్రవర్తి, తేజ, ఉత్తేజ్ సహా పలువు నటీనటులు, దర్శకులు ఉండేవారు.అంతా కలిసే పని చేసేవారు.
ఒకానొక సమయంలో తేజ ఓ పుస్తకం తెచ్చుకుని చదువుతున్నాడు.ఈ విషయాన్ని జేడీ చక్రవర్తి గమనించాడట.
ఇంట్రెస్టుగా చదువుతున్న ఆయన దగ్గరకు వెళ్లి పుస్తకం ఇస్తావా? చదివి రేపు ఇస్తాను అన్నాడట.దానికి తేజ చాలా రూడ్ గా ఇవ్వను అన్నాడట.
దాంతో జేడీకి చాలా కోపం వచ్చిందట.కొట్టాలన్నంత కసి ఏర్పడిందట.
అంతలోనే తేజ కలుగుజేసుకుని.మా ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉంది నీకు తెలుసా? అన్నాడట.తెలుసు అని చెప్పాడట జేడీ.ఆ పుస్తకాలన్నీ నేను రేపు ఇస్తానని తీసుకొచ్చినవే అన్నాడట.అందుకే నేను పుస్తకాలు రేపు ఇస్తాను అనే వారికి ఇవ్వనని చెప్పాడట.

అటు శివ సినిమా సమయంలోనే జేడీ చక్రవర్తి టాటా మారుతి కారు తీసుకున్నాడట.ఆ విషయం తోటి మిత్రులకు చెప్పాడట జేడీ.అందరూ అతడికి కంగ్రాట్స్ చెప్పారట.
పక్కనే ఉన్న తేజ మాత్రం చెప్పలేదట.పైగా ఎందుకు కంగ్రాట్స్? కంపెనీ వాళ్లు కారు తయారు చేశారు? ఈయన కొన్నాడు.అందులో కంగ్రాట్స్ ఎందుకు? అన్నాడట.అయితే నిన్ను కంగ్రాట్స్ చెప్పమని అడగలేదు తేజా.
పైగా మిగతా వారికి కూడా నేను కంగ్రాట్స్ చెప్పమనలేదు.వారే చెప్పారు.
అన్నాడట.ఇలా తమ మధ్య తొలుత అపార్థాలతోనే స్నేహం మొదలైనట్లు చెప్పాడు.
ఆ తర్వాత ఇద్దరు మంచి మిత్రులు అయినట్లు జేడీ వెల్లడించాడు.