చలికాలంలో ఆస్తమా పేషంట్స్ ఇవి తీసుకుంటే మంచిది..!

ఈ మధ్య కాలంలో చాలా మంది ఆస్తమా( Asthma ) లాంటిది దీర్ఘకాలిక శ్వాస కోశ స్థితిని ఎదుర్కొంటున్నారు.అలర్జీతో వాయునాళాలకు వాపు రావడంతో అవి కుంచించుకొని పోతాయి.

 Healthy Food For Asthma Patients To Take In Winter Details, Healthy Food ,asthma-TeluguStop.com

చలి కాలంలో( Winter ) ఆస్తమా పేషెంట్ లకు చాలా కష్టకాలమే చెప్పుకోవాలి.వాతావరణంలో మార్పులు మంచు కారణంగా ఆస్తమా ఇంకా ఎక్కువవుతుంది.

దీంతో ఊపిరి సరిగ్గా ఆడక, ఉక్కిరిబిక్కిరి అవుతారు.ఈ సీజన్ లో ఆస్తమా లక్షణాలు కంట్రోల్ లో ఉంచడానికి కొన్ని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే ఆస్తమా లక్షణాలను కంట్రోల్ చేయడానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Inflammatory, Asthma, Asthma Tips, Fatty Fish, Greenleafy, Healthy, Spina

ముఖ్యంగా చెప్పాలంటే సాల్మన్‌, ట్యూనా, సార్డినెస్‌ లాంటి కొవ్వు చేపలలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్( Omega-3 Fatty Acids ) ఉంటాయి.వీటిలో ఆస్తమా లక్షణాలను తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.ఆస్తమా పేషెంట్స్ వారానికి రెండు సార్లు ఇలాంటి ఫిష్( Fish ) తీసుకుంటే చాలా మంచిది.

ఇక పసుపులో( Turmeric ) కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయన్న విషయం మనందరికీ తెలిసిందే.అలాగే ఇవి శరీరంలో వాపును, మంటను తగ్గిస్తాయి.అంతేకాకుండా పసుపు ఆస్తమా లక్షణాలను కూడా కంట్రోల్ చేయడానికి ఎంతగానో తోడ్పడుతుందని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.ఇక చాలా మంది ఆస్తమాతో బాధపడుతూ ఉంటారు.

అలా మీరు కూడా బాధపడుతూ ఉంటే మీ కూరల్లో కాస్త ఎక్కువగా పసుపును చేర్చుకోవడం మంచిది.

Telugu Inflammatory, Asthma, Asthma Tips, Fatty Fish, Greenleafy, Healthy, Spina

ఇంకా చెప్పాలంటే పాలకూర ఆకుకూరల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి.ఇవి కూడా ఆస్తమా లక్షణాలను నియంత్రించడంలో ఎంతగానో సహాయపడతాయి.కాబట్టి ఈ కూరగాయలను సలాడ్‌లు, స్టైర్-ఫ్రైస్, స్మూతీస్ లో చేర్చుకొని తీసుకోవడం వలన ఆస్తమా లక్షణాల నుండి దూరం గా ఉండవచ్చు.

అంతేకాకుండా ఆస్తమా పేషెంట్స్ వీలైనంతవరకు చల్లటి నీటికి దూరంగా ఉండాలి.వీలైనంతవరకు గోరువెచ్చని నీటిని( Warm Water ) మాత్రమే తాగడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఎందుకంటే చల్లటి నీటిని తీసుకోవడం వలన ఆస్తమా లక్షణాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube