బంగాళదుంపతో ఇలా చేస్తే ఊడిన జుట్టు సైతం మళ్లీ తిరిగి వస్తుంది.. తెలుసా?

సాధారణంగా కొందరిలో హెయిర్ గ్రోత్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది.దీని కారణంగా ఊడే జుట్టు ఊడుతుంది.

 Doing This With Potato Will Double The Hair Growth , Potato, Hair Growth, Latest-TeluguStop.com

కానీ మళ్ళీ తిరిగి రాదు.ఫలితంగా ఒత్తుగా ఉన్న జుట్టు పల్చగా మారిపోతుంది.

ఈ సమస్యను మీరు కూడా ఫేస్ చేస్తున్నారా.? అయితే డోంట్ వ‌ర్రీ.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్ రెమెడీని పాటిస్తే హెయిర్ గ్రోత్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.ఊడిన జుట్టు మళ్ళీ తిరిగి వస్తుంది.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

బంగాళదుంప దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో దీనిని విరివిరిగా వాడుతుంటారు.

బంగాళదుంపతో రకరకాల వంటలు చేస్తుంటారు.ఆరోగ్యానికి సైతం బంగాళదుంప అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.

అలాగే హెయిర్ గ్రోత్ ను పెంచడానికి సైతం బంగాళదుంప సహాయపడుతుంది.అందుకోసం ఒక మీడియం సైజు బంగాళదుంప తీసుకుని పీల్ తొలగించి వాట‌ర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

Telugu Extravirgin, Care, Care Tips, Fall, Regrowth, Latest, Potato-Telugu Healt

ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఒక ఎగ్ వైట్ ను వేసుకోవాలి.అలాగే తయారుచేసి పెట్టుకున్న బంగాళాదుంప జ్యూస్, రెండు టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా వ‌ర్జిన్ కోకోనట్ ఆయిల్ వేసుకుని స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Extravirgin, Care, Care Tips, Fall, Regrowth, Latest, Potato-Telugu Healt

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల‌ నుంచి చివర్ల‌ వరకు అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.రెండు గంటల అనంతరం మైల్డ్‌ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.ఈ రెమెడీని వారంలో ఒకే ఒక్కసారి పాటిస్తే గనుక హెయిర్ గ్రోత్ సూపర్ గా పెరుగుతుంది.

దీంతో ఊడిన జుట్టు మళ్ళీ తిరిగి వస్తుంది.ఫలితంగా పల్చగా మారిన జుట్టు ఒత్తుగా తయారవుతుంది.

అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టు కుదుళ్ళు దృఢంగా మారతాయి.దాంతో జుట్టు రాలడం సైతం తగ్గుముఖం పడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube