ఈ ఏడాది మే నెలలో శని జయంతి జరుపుకోనున్నారు.శని జయంతి( Shani Jayanti ) రోజు కొన్ని పనులు చేస్తే జీవితంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు( Astrologers ) చెబుతున్నారు.
జేష్ఠ మాసంలో అమావాస్య తిధి రోజు శని దేవుడి జన్మ దినం జరుపుకుంటారు.శని దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల శని దేవుడి చెడు ప్రభావం దూరం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఈ రోజు ఎవరైతే శని దేవుణ్ణి నిష్ఠతో పూజిస్తారో, ఆయనకు ఇష్టమైన పనులు చేస్తారో వారి జీవితంలో ఉన్నటువంటి సమస్త బాధలను శని దేవుడు దూరం చేస్తారు.ఇలా పూజించడం వల్ల శని అనుగ్రహం లభిస్తుందని, అలాగే సర్వ దోషాలు దూరం అయిపోతాయని చాలా మంది ప్రజలు నమ్ముతారు.
ఈ సంవత్సరం మే 18 వ తేదీన రాత్రి 9 గంటల 44 నిమిషాల నుంచి మే 19వ తేదీ రాత్రి 9 గంటల 20 నిమిషాల వరకు శనిజయంతి సమయంగా పండితులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే శని దేవుడినీ పూజించడానికి మే 19 వ తేదీ ఉదయం ఏడు గంటల 11 నిమిషాల నుంచి రాత్రి 7 గంటల ఏడు నిమిషముల వరకు శుభ సమయం అని చెబుతున్నారు.
ఈ శుభ సమయంలో శని దేవుని పూజించినట్లయితే ఆయన అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే ఇదే సమయంలో శని జయంతి రోజు దానం చేయడం కూడా చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.శని దేవుడి మంత్రాన్ని జపిస్తూ దానధర్మాలు చేయడం వల్ల జీవితంలో ఉన్న అడ్డంకులు, కష్టాలు దూరమైపోతాయి.అంతేకాకుండా శని జయంతి రోజున నల్లటి వస్తువులు దానం చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు.
అంతేకాకుండా నల్లని వస్త్రాలు,నల్లని బూట్లు, నువ్వులు, ఇనుము, నువ్వుల నూనె( Sesame, iron, sesame oil ) వంటి వస్తువులను కూడా దానం చేయడం వల్ల శని దేవుడు మన జీవితంలో ఉన్న కష్టాలను దూరం చేస్తాడు.కాబట్టి శని జయంతి యొక్క మహత్యాన్ని తెలుసుకొని ఆరోజు కచ్చితంగా పూజలు చేసి ఈ వస్తువులు కూడా దానం చేయాలి.