అద్దం ఏ దిశలో పెట్టుకోవాలి.. దాని నివారణ చర్యలు ఇవే..?

ఇంట్లో ఏ దిశలోని గోడ పై ఏ అద్దం( Mirror ) పెట్టాలో కూడా కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి.వాస్తు శాస్త్రంలో ప్రతి దానికి సరైన దిశ అవసరమైన నియమాలు ఉన్నాయి.

 In Which Direction Should The Mirror Be Placed.. What Are Its Preventive Measure-TeluguStop.com

వీటిని అనుసరించడం వల్ల సంతోషం, శ్రేయస్సు కలుగుతుంది.అంతే కాకుండా ఇంట్లో అదృష్టం పెరుగుతుంది.

వాస్తు ప్రకారం ఇంట్లో ఎల్లప్పుడూ చదరపు ఆకారం అద్దన్ని ఉపయోగించాలి.అంతే కాకుండా గుండ్రంగా లేదా ఓవల్ అద్దాన్ని ఉపయోగించడం మంచిది కాదు.

ఓవల్ మిర్రర్ ప్రభావం వల్ల పాజిటివ్ ఎనర్జీ ప్రతికూల శక్తి గా మారుతుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.

ఇంకా చెప్పాలంటే అద్దం మంచం కనిపించని ప్రదేశంలో ఉంచాలి.ఇది విలు కాకపోతే నిద్రపోయేటప్పుడు అద్దన్ని క్లాత్ తో కవర్ చేసుకోవాలి.వాస్తు ప్రకారం( Vastu ) ఇంట్లో ఎక్కడైనా పగిలి అద్దం ఉంటే దానిని ఎక్కువ సేపు అస్సలు ఉంచకూడదు.

వీలైనంత త్వరగా దానిని దూరంగా ఉంచడమే మంచిది.ఎందుకంటే పగిలిన అద్దం ఉండడం వల్ల వాస్తు దోషాలు కలుగుతాయి.ఒక అద్దాన్ని మరొక అద్దం ముందు ఉంచకూడదు.ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఏర్పడే వాస్తు దోషం ఆ ప్రదేశం లోని శాంతి, శక్తి కమ్యూనికేషన్ కు భంగం కలిగిస్తుంది.

ముఖ్యంగా చెప్పాలంటే కిటికీ లేదా తలుపు ముందు అద్దాన్ని ఎప్పుడూ ఉంచకూడదు.ఎందుకంటే దాని నుంచి వచ్చే సానుకూల శక్తి తలుపులను కిటికీలను ప్రభావితం చేస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో అమర్చిన అర్థం అకస్మాత్తుగా పగిలిపోవడం వల్ల ఇంట్లోకి వచ్చే ఇబ్బందులు రాకకు సంకేతం అని చాలామంది ప్రజలు నమ్ముతారు.కాబట్టి ఇలాంటి నివారణ చర్యలు అన్ని పాటించడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు( Vastu Dosha ) ఏర్పడకుండా సంతోషం, శ్రేయస్సు కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube