సమాజంలో ఒంటరిగా రోడ్లపై వెళ్లే మహిళలకు రక్షణ లేకుండా పోతోంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చిన, ఎంత కఠిన శిక్షలు విధించిన కొందరు నీచమైన వ్యక్తులలో కాస్తయినా మార్పు అనేది లేదు అనేందుకు ఈ సంఘటనే నిదర్శనం.
రంగారెడ్డి( Ranga Reddy ) జిల్లాలో రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న ఓ యువతిని బట్టలన్నీ చింపేసి నగ్నంగా రోడ్డుపై నిలబెట్టి, చుట్టుపక్కల ఉండే స్థానికులను ఓ మందు బాబు భయబ్రాంతులకు గురిచేశాడు.అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.
వివరాల్లోకెళితే.పెద్ద మారయ్య( pedda marayya ) (30) అనే వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.పెద్ద మారయ్య పీకలదాకా మద్యం తాగి ఆదివారం అర్ధరాత్రి సమయంలో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్( Jawahar Nagar Police Station ) పరిధిలోని బాలాజీ నగర్ బస్ స్టాప్ వద్ద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న యువతి (28) తో చాలా అసభ్యంగా ప్రవర్తించి, ఆమెపై దాడి చేసి ఒంటిపై ఉండే బట్టలు అన్ని చింపేశాడు.ఇదంతా చూస్తున్న మరో మహిళ అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆ మహిళపై కూడా దాడికి ప్రయత్నించాడు.

ఇక ఆ యువతి ను బట్టలు లేకుండా నగ్నంగా చేసి రోడ్డుపై నిలబెట్టి నానా రచ్చ చేశాడు.చుట్టుపక్కల ఉండే వారంతా చూస్తూ నిలబడడం తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోయారు.దాదాపుగా 15 నిమిషాల పాటు ఆ యువతిని రోడ్డుపై నగ్నంగా కూర్చోబెట్టి, తరువాత పెద్ద మారయ్య అక్కడి నుంచి వెళ్లిపోయాడు.ఆ కీచకుడు అక్కడి నుండి వెళ్ళిపోయిన వెంటనే పలువురు ఆ మహిళపై వస్త్రాలు కప్పి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ యువతికి రక్షణ కల్పించి పెద్ద మారయ్యను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు చుట్టుపక్కల ఉండే సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించగా ఇందులో అన్ని దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
వాటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







