అందరి వంటింట్లో ఉండే ఔషదాల్లో బిర్యానీ ఆకు కూడా ఒకటి.బిర్యానీ ఆకును కేవలం బిర్యానీలోనే కాకుండా.
ఇతర వంటల్లోనూ కూడా వినియోగిస్తుంటారు.ఈ బిర్యానీ ఆకు వంటలకు చక్కని రుచి ఇవ్వడంతో పాటు.
బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.ముఖ్యంగా ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా బిర్యానీ ఆకుతో చెక్ పెట్టవచ్చు.
అవేంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేద్దాం.
బిర్యానీ ఆకులతో తయారు చేసుకున్న టీను ప్రతిరోజు సేవిచడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిస్తుంది.
అదే సమయంలో గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది.అలాగే ఒత్తిడిగా ఉన్నప్పుడు టీ, కాఫీలు బదులు బిర్యానీ ఆకులతో తయారు చేసిన టీ తాగితే.
మంచి రిలీఫ్ లభిస్తుంది.జలుబు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యలు ఉన్నవారు.
బిర్యానీ ఆకులను నీటిలో మరిగించి.అనంతరం వడగట్టుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
మధుమేహం. ఇటీవల కాలంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.ఎప్పుడో అరవై ఏళ్ల తర్వాత రావాల్సిన మధుమేహం.ఇప్పడు పాతికేళ్లకు వస్తుంది.అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం సమస్యకు ఈజీగా చెక్ పెట్టవచ్చు.ముఖ్యంగా బిర్యానీ ఆకు పొడిని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నీటిలో కలుపుకుని తాగితే.
మధుమేహంను నియంత్రించవచ్చు.
అలాగే రోగ నిరోధక శక్తి పెంచే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి కూడా బిర్యానీ ఆకులో పుష్కలంగా ఉంటాయి.
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ రోగ నిరోధక శక్తి బలపడటం ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇక వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులు రకుండా నివారించడంలోనూ బిర్యానీ ఆకు గ్రేట్‌గా సహాయపడుతుంది.
అందుకే బిర్యానీ ఆకును ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తీసుకుంటే మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.