అదృష్టం తెచ్చే చిలుకలు.. అయితే ఏ దిశలో..

ఇంట్లో వాస్తు శాస్త్రం ప్రకారం చిలుకలను పెంచడం చాలా మంది ప్రజలు శుభంగా భావిస్తారు.చిలుకలు ఇంట్లోకి వచ్చే ప్రతికూల శక్తిని ఆకర్షించి, ఇంట్లో సానుకూలతను పెరిగేలా చేస్తాయి.

 Parrots Bring Luck.. But In Which Direction, , Green Parrots , Luck, Vastu, Nort-TeluguStop.com

ఇంట్లో చిలకల చిత్రాన్ని పెట్టుకుంటే కూడా మీకు అదృష్టాన్ని మార్చేవిగా ఉంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.అయితే చిలకల చిత్రాలను పెట్టడానికి సరైన వాస్తు దిశలో పెట్టడం మంచిది.

ఇక ఇంట్లో కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆరోగ్య సమస్యల నుండి బయటపడడం కోసం చిలుకల చిత్రాలను ఇంట్లో పెట్టడం మంచిదని చెబుతున్నారు.

చిలకలు ఇంట్లో ఉన్న సమస్యలను దూరం చేయడంలోనూ, నెగిటివ్ ఎనర్జీని దూరం చేయడానికి చిలుకలు ఎంతగానో ఉపయోగపడతాయి.

ఉత్తర దిశలోనే చిలుకల చిత్రాలు ఉండేలా చూసుకోవడం మంచిది.ముఖ్యంగా పిల్లలు చదివే గదిలో ఉత్తర దిశలో చిలుకల చిత్రాలను పెట్టినట్లయితే పిల్లలు విద్యలో బాగా రాణిస్తారు.

చిలుకలను పెంచుకోవడం వల్ల మన ఇంట్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయని, అంతేకాకుండా శుభాలు కలిగి, ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు.

అంతేకాకుండా చిలుకలను ఇంట్లో పెంచుకునేవారు వాటికి స్వీట్ చాహితమైన వాతావరణాన్ని కల్పించాలి.భార్యాభర్తల మధ్య ఏమైనా ఆటంకాలు ఉంటే ఆటంకాలు తొలగిపోవడానికి భార్య భర్తల మధ్య సఖ్యత పెరగడానికి చిలుకల జంట చిత్రాలను పడకగదిలో పెట్టడం మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.ఇలా చేయడం వల్ల భార్య భర్తల మధ్య అనుబంధం పెరిగి ప్రేమ మరింత బలపడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

పచ్చని రంగుతో కిలకిల రావాలతో సందడి చేసే చిలుక లు మనకు ఆహ్లాదాన్ని కలిగించడమే కాకుండా వాస్తు పరంగా చాలా మేలు జరిగేలా చేస్తాయి.చిలుకల చిత్రాలు గాని, చిలకల బొమ్మలు గాని ఇంట్లో పెట్టుకుంటే రాహువు, కేతువు, శని దోషాల నుంచి చెడు దృష్టి నుంచి కొంతమేరకు ఉపశమనం పొందవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube