మాజీ జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ( Anasuya Bhardwaj )వరుసగా సినిమాలతో దూసుకెళ్తోంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ “సింబా”( Simba ) అనే ఎమోషనల్ రివెంజ్ డ్రామాలో నటించింది.
ఇందులో జగపతి బాబు, కస్తూరి( Jagapathi Babu, Kasturi ) కూడా యాక్ట్ చేశారు.గతంలో అనసూయ చేసిన రంగమ్మత్త, దాక్షాయణి పాత్రలు సినిమాలో చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ కలిగి ఉంటాయి కాబట్టి ఆమె నటనలో మైనస్‌లు ఉన్నా ప్రేక్షకులు అంగీకరించారు.
కానీ ఇప్పుడు ఆమె సింబా మూవీలో మెయిన్ లీడ్ రోల్ చేసింది.సింబా అనేది ఒక సీరియస్ సినిమా.
ఈ మూవీని ఫస్ట్ నుంచి చివరి వరకు అనసూయనే తన భుజాలపై మోయాల్సి ఉంటుంది.సీరియస్ సీన్లకు తగినట్టుగా ఎన్నో ఎమోషన్స్ పలికించాల్సి ఉంటుంది.
కానీ అనసూయది చాలా నవ్వు ముఖం.ప్రేక్షకులందరూ ఆమెను జాలీగానే చూశారు.
ఆ స్మైలింగ్ ఫేస్ ఎప్పుడూ మారదు.ఇప్పటిదాకా చూసిన సినిమాల్లో ఆమె ఫేస్ అలానే ఉంది తప్ప ఎప్పుడూ నవరసాలను పలికించలేకపోయింది.
అంటే ఆమె ఫేస్ అన్ని ఎమోషన్స్ పలికించేటంత ఫ్లెక్సిబుల్ కాదు.

ఒక సినిమాలో హీరోగా నటించడమనేది పిచ్చి డ్రెస్సులు వేసుకుని డ్యాన్స్‌లు వేసినంత ఈజీ కాదు.కానీ దర్శకులు ఇవేమీ చూడడం లేదు.అనసూయ కొద్దిగా తెలిసిన ముఖం అని తన సినిమాలోని మెయిన్ క్యారెక్టర్ రోల్స్ ఆమెకు ఇస్తున్నారు.
దర్శకుడు మురళీ మనోహర్ రెడ్డి ( Murali Manohar Reddy )కూడా తన “సింబా” సినిమాలో అలానే అవకాశం ఇచ్చాడు.అయితే ఈ డైరెక్టర్ రాసుకున్న స్టోరీ లైన్ లో మొదట బాగానే అనిపించినా ఆ తర్వాత చాలా వరస్ట్ గా మారిపోయింది.
ఈ సినిమాలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి.దీనికి కారణం ఒక స్కూల్ టీచర్ (అనసూయ), జర్నలిస్టు అని పోలీసులు నిర్ధారణకి వచ్చి వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు.
అయితే ఈ స్కూల్ టీచర్ కేరక్టరైజేషన్ బాగోలేదేమో కనిపిస్తుంది.దానికి తోడు అనసూయ చెత్తగా నటించింది కాబట్టి అంతగా మెప్పించలేకపోయింది.జగపతిబాబు పాత్ర కూడా తేలిపోయింది.ఈ సినిమాలో ఒక మెసేజ్ చూపిద్దాం అనుకున్నా కానీ దాన్ని సరిగా చెప్పలేకపోయాడు డైరెక్టర్.

సాధారణంగా ఈ రోజుల్లో ఏదైనా సందేశం ఇవ్వాలంటే దాన్ని ప్రేక్షకులే సొంతంగా అర్థం చేసుకునే లాగా ఉండాలి.కానీ సింబా డైరెక్టర్ మాత్రం డైరెక్ట్‌గా చెప్పేసాడు.ఎంగేజింగ్‌గా స్టోర్ ప్రజెంట్ చేయకుండా డైరెక్ట్ గా మెసేజ్ ఇచ్చాడు.ఇప్పుడు అలాంటి డైరెక్ట్ మెసేజ్ లు వినే ప్రేక్షకులు ఎవరూ లేరు.జగపతిబాబు, అనసూయల రోల్స్ తప్ప మిగతా పాత్రలన్నీ కూడా పేలవంగా రాసుకున్నాడు.అందువల్ల ఈ మూవీ ఫ్లాప్ అయింది.