ఇప్పుడు మీరు చూస్తన్నా ఈ నటుడు ఒక పెద్ద సినిమాలో హీరో.మనందరికి ఎంతో ఇష్టమైన సినిమాలో నటించిన ఈ హీరో ప్రస్తుతానికి గుర్తు పట్టకుండా మారిపోయారు.
ఇంకా గుర్తు పట్టలేదు ? ఇతను మరెవరో కాదు బాయ్స్ సినిమా గుర్తుందా ? అందులో నలుగురు హీరోలు ఉంటారు.అందరివీ ముఖ్యమైన పాత్రలే.
ఆ నలుగురిలో ఒకరైన మణికందన్.చూస్తే మీ కళ్ళను మీరే నమ్మలేదు కదా.ఒకప్పుడు చక్కగా, సన్నగా ఉండి ఫ్యూచర్ లో స్టార్ అవుతాడు అనుకున్న మణికందన్ ఇలా మారిపోయాడు ఏంటి అని అనుకుంటున్నారా ? హీరో అవ్వాల్సిన మణి ఇలా ఎక్కడ కనిపించకుండా పోవడానికి అనే కారణాలు ఉన్నాయ్.
బాయ్స్ సినిమా చదువు యొక్క ప్రాముఖ్యాన్ని తెలియచేస్తూ తీసిన సినిమా.
ఇందులో సిద్ధార్త్, జెనీలియా మెయిన్ లీడ్ గా నటించగా ప్రేమిస్తే సినిమా భరత్, దేవయాని తమ్ముడు నకుల తో పాటు ఎస్ ఎస్ థమన్ కూడా ఒక హీరో గా నటించాడు.వీరితో సమానంగా మణికందన్ పాత్ర ఉంటుంది.ఇక మణికందన్ చిన్ననాటి నుంచి నటన అంటే ఎంతో ఆసక్తి ఉండటం తో విజువల్ కమ్యూనికేషన్స్ చదివి కళ మాస్టర్ డ్యాన్స్ ట్రూప్ లో జాయిన్ అయ్యి స్టేజి షోలు ఇచ్చాడు.2002 లో బాయ్స్ సినిమాతో శంకర్ అతడిని ఇండస్ట్రీ కి తీసుకురాగా 2022 వరకు అతడు చేసినవి కేవలం తొమ్మిది సినిమాలు మాత్రమే.
ఇందులో మణికందన్ పొరపాట్లతో పాటు, అతడి స్నేహితులు కూడా సరైన వారు కాకపోవడం తో తప్పుడు నిర్ణయాలు తీసుకొని కెరీర్ మొత్తం పోగొట్టుకున్నారు.హీరోగా వేషాలు రావు అని గ్రహించిన మణికందన్ విలన్ గా కూడా చేసిన అవి కూడా అతడికి కలిసి రాలేదు.దాంతో మెల్లిగా ఇండస్ట్రీ కి దూరం అయ్యాడు.2014 తర్వాత అయన మల్లి ఏ సినిమాలోనూ కనిపించలేదు.2021 లో విడుదల అవుతుంది అనుకున్న భగీర సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు.ఒకవేళ ఈ సినిమా కనుక విడుదల మంచి విజయం సాధిస్తే కనక మణికందన్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతుంది అనుకోవచ్చు.