ఎండు ద్రాక్ష. వీటినే చాలా మంది కిస్మిస్ అని పిలుస్తుంటారు.
డ్రైడ్ ఫ్రూట్స్‌లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఎండు ద్రాక్ష రుచి పరంగానే కాదు, పోషకాల పరంగానూ అమోఘమనే చెప్పాలి.ఎందుకంటే, ఎండు ద్రాక్షలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి, ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.
అందుకే ఎండు ద్రాక్షను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకుంటే మంచిదని నిపుణులు చెబుతుంటారు.అయితే ఎండు ద్రాక్ష వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు పలు దుష్ర్పభావాలు కూడా ఉన్నాయి.
అవును, ఎండు ద్రాక్షను పరిమితికి మించి తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు మనల్ని ఇబ్బంది పెడతాయి.మరి ఆ సమస్యలేంటో.? ఎందుకు ఇబ్బంది పెడతాయో.? ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.అధిక బరువు ఉన్న వారు వీటిని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది.ఎండు ద్రాక్షలో కేలరీల శాతం అధికంగా ఉంటుంది.అందు వల్ల, వీటిని ఓవర్‌గా తీసుకుంటే మరింత బరువు పెరిగి పోతారు.
అలాగే ఎండు ద్రాక్షలు రక్త పోటు స్థాయిలను తగ్గించడంలో గ్రేట్‌గా సహాయపడతాయి.
కాబట్టి, ఇవి హైబీపీ ఉన్న వారికి మాత్రమే.కానీ, లోబీపీ సమస్యతో బాధ పడే వారు ఎండు ద్రాక్షలను ఎడా పెడా తినేస్తే రక్త పోటు స్థాయిలు ఘోరంగా తగ్గిపోతాయి.
ఎండు ద్రాక్షలను అతిగా తీసుకోవడం వల్ల ఉదర సంబంధిత సమస్యలనూ ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇక బ్లడ్ షుగర్ లెవల్స్ తక్కువ ఉన్న వారు మరియు మధుమేహం ఉండి బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గడానికి మందులు వాడుతున్న వారు ఎండు ద్రాక్షలను చాలా అంటే చాలా మితంగా తీసుకోవాలి.లేకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ తప్పి అనేక సమస్యలను తెచ్చిపెడతాయి.