దాన వీర శూర కర్ణ సినిమాలో ఎన్టీఆర్ కంటే ఎక్కువ పాత్రలు పోషించిన నటుడు ఎవరో తెలుసా ?

నందమూరి తారక రామారావు నటించిన దాన వీర శూర కర్ణ సినిమా గురించి మన అందరికి తెలిసిందే.ఈ చిత్రం 1977లో ఎన్టీఆర్ స్వీయ నిర్మాణంలో అలాగే స్వీయ దర్శకత్వంలో విడుదల అయింది.

 Chalapathi Rao Roles In Danaveera Shura Karna , Dana Veera Sura Karna Movie, Cha-TeluguStop.com

ఆయన నటించిన పౌరాణిక చిత్రంలో ఇది ఒక అత్యుత్తమైన చిత్రమని చెప్పుకోవచ్చు.ఇక దీనికి స్వయంగా ఆయనే కథ కూడా సమకూర్చడం చెప్పుకోదగ్గ విషయం.ఈ సినిమాలో ఆయన బహుముఖ పాత్రలో కనిపించి ఆయన అభిమానులు అందరిని కూడా కనువిందు చేశారు.50 ఏళ్ల క్రితం ఈ సినిమా కేవలం పదిలక్షల రూపాయల బడ్జెట్ తో నిర్మాణం జరుపుకోగా కోటి రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది.తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా భారతీయ సినిమా ఇండస్ట్రీలో కూడా ఇది అత్యంత పొడవైన సినిమా అంటే దీనిని ఏకంగా నాలుగు గంటల 17 నిమిషాలు.

కేవలం 43 రోజుల్లోనే నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రంలో అనేక వింతలు విశేషాలు ఉన్నాయి.

ఇక సీనియర్ ఎన్టీఆర్ తో పాటు ఈ సినిమాలో హరికృష్ణ అర్జునుడి పాత్రలో నటించగా అభిమన్యుని పాత్రలో బాలకృష్ణ నటించాడు.ఈ సినిమా త్వరితగతిన ఆ షూటింగ్ పూర్తి చేసుకోవాలని ఉద్దేశంతో బాలకృష్ణ మరియు హరికృష్ణ పెయింటింగ్స్ మరియు ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో పనిచేయడం విశేషం వారు మయసభను తీర్చిదిద్దారు ఇక బాలకృష్ణ హరికృష్ణ లకు ఎన్టీఆర్ స్వయంగా మేకప్ వేసేవారట.

ఇక మరొక విచిత్రం ఏమిటంటే ఈ సినిమా రెండవసారి 1994లో విడుదల కాగా మళ్లీ కూడా కోటి రూపాయలు వసూలు సాధించడం.

Telugu Athirada, Chalapathi Rao, Danaveera, Drushtadyumna, Indra, Jarasada, Nand

ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ అర్జునుడిగా కర్ణుడిగా దుర్యోధనుడిగా మూడు పాత్రలు పోషించారు అప్పట్లో ఒక హీరో బహుముఖ పాత్రలో నటించడం అంటే అభిమానులకు ఎంతో త్రిలింగ ఉండేది అన్ని పాత్రలు వారే కనిపిస్తే టికెట్కు పెట్టిన డబ్బులు వర్కౌట్ అవుతాయని నిర్మాతలు కూడా భావించేవారు.ఇక ఎన్టీఆర్ తో పాటు అతనికి ఎంతో ఆత్మీయుడైన చలపతిరావు కూడా ఐదు పాత్రలో కనిపించాడు.ఇంద్రుడు,జరాసదుడు, అతిరదుడు, సూతుడు, విప్రుడు, ద్రుష్ట‌ద్యుమ్నుడు గా ఆయన కనిపించారు.

కానీ ఇలా చలపతిరావు ఐదు పాత్రలు పోషించిన విషయం అభిమానులు ఎవ్వరూ కూడా గుర్తించకపోవడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube