అకస్మాత్తుగా మైకం కమ్మినట్లు అనిపిస్తే దేనికి సంకేతమంటే..!

If You Suddenly Feel Dizziness, This Is A Sign , Dizziness , Health , Health Tips, Heart , Circulatory System ,fruit Juice , Blood , Blood , Heart Health

చాలా మంది ప్రజలలో ఉన్నట్టుండి కళ్లు తిరిగినట్లు మైకం వచ్చినట్లు కొద్ది క్షణాలలో అనిపిస్తూ ఉంటుంది.కాసేపటి తర్వాత తిరిగి మామూలుగా మారిపోతుంది.

 If You Suddenly Feel Dizziness, This Is A Sign , Dizziness , Health , Health Ti-TeluguStop.com

అయితే చాలామంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు.ఇలా మైకం రావడానికి కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

చాలాసేపు ఓకే చోటా కూర్చొని హఠాత్తుగా లేవడానికి ప్రయత్నించినప్పుడు ఉన్నటువంటి కళ్లు తిరిగినట్టు అనిపిస్తుంది.కొంతమందికి నడుస్తున్నప్పుడు లేదంటే వేరే ఏదైనా పని చేస్తున్నప్పుడు మైకం కమ్మిన( Dizziness ) భావన వస్తుంది.

మన శరీరంలో ఏ చిన్న మార్పు జరిగిన దాని ప్రభావం మన ఆరోగ్యం పై ఖచ్చితంగా ఉంటుంది.చాలామంది అథ్లెట్లు ఎక్కువగా వర్కౌట్ చేస్తూ ఉంటారు.వారి కెరియర్ కోసం వాళ్ళు అలా చేస్తుండగా దీనివల్ల గుండె పనితీరులో మార్పు వస్తుంది.ఈ సమయంలో గుండె బలంగా మారి తక్కువ హృదయ స్పందనల్లో ఎక్కువ రక్తాన్ని పంప్ చేస్తుంది.

వర్క్ అవుట్ చేసిన తర్వాత విశ్రాంతి తీసుకునే సమయంలో గుండెకు ఒకసారిగా విశ్రాంతి లభించడం వల్ల మైకం కమ్మిన భావన వస్తుంది.

కొంతమంది రకరకాల కారణాల వల్ల తగినంత ఆహారాన్ని తీసుకోకుండా చాలా రకాల ఫ్రూట్ జ్యూస్లు తీసుకుంటూ ఉంటారు.దీనివల్ల శరీరంలో చక్కెరల స్థాయి పడిపోయి మైకం కమ్మినట్లు అనిపిస్తుంది.కాబట్టి భోజనాన్ని సరైన సమయానికి తీసుకోవడం మంచిది.

ముఖ్యంగా చెప్పాలంటే కొన్నిసార్లు శరీర భాగాలకు రక్త ప్రసరణ సరిగ్గా( Circulatory system ) జరగకుంటే కూడా ఇలా జరుగుతుంది.అందుకోసం శరీరానికి తగినంత నీరు తాగుతూ ఉండాలి.

ముఖ్యంగా చెప్పాలంటే మైకంతో పాటు వేరే ఏదైనా అనుభూతి చెందితే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించడం ఎంతో మంచిది.

Video : ఆకస్మాత్తుగా మైకం కమ్మినట్లు అనిపిస్తే దీనికి సంకేతమం #TeluguStopVideo

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube