సాధారణంగా మనం చిలకడ దుంపలను( sweet potato ) ఆహారంగా తీసుకుంటూ ఉంటాం.అన్ని దుంపల లాగే చిలకడదుంపలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
వీటిని కాల్చుకొని, ఉడికించి తింటూ ఉంటాం.ఈ మధ్యకాలంలో చిలకడదుంపల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయని చాలామంది వీటిని తీసుకోవడం తగ్గించేశారు.
అయితే చిలకడ దుంపల లాగే చిలకడ దుంప ఆకులు(sweet potato leaves ) కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి అని నిపుణులు చెబుతున్నారు.వీటిని తీసుకోవడం వలన ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది.
అయితే ఈ ఆకులను ఆకుకూరల లాగా మనం వండుకొని తినవచ్చు.

అలాగే ఇతర ఆకుకూరలతో కూడా కలిపి పప్పు, వేపుడు, కూర లాంటి వాటిని తయారు చేసుకొని తినవచ్చు.మనం ఇంట్లో ఈ చిలకడ దుంప మొక్కను పెంచుకోవడం వలన తరచూ ఆకులను కట్ చేసుకుని సులభంగా వండుకొని తినవచ్చు.ఈ ఆకుల్లో క్యాలరీల శక్తి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్స్ ఉంటాయి.
అలాగే ఇందులో విటమిన్ సి, పొటాషియం, ఉంటాయి.ఈ ఆకుల్లో 24 రకాల యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.
అందుకే ఈ ఆకులను తీసుకోవడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.అంతేకాకుండా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది.

రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడినా కూడా ఇది వాటిని నివారిస్తుంది.ఇక కాలేయంలోని ఫ్రీరాడికల్స్( Free radicals in the liver ) ను నశింపజేసి కాలేయ కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.ఈ మధ్యకాలంలో చాలా మంది జంక్ ఫుడ్, నూనెలో వేయించిన పదార్థాలను తీసుకుంటున్నారు.దీంతో కాలేయ సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు.అలాంటివారు ఈ చిలకడదుంప ఆకులను తీసుకోవడం వలన కాలేయ ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది.దీంతో కాలేయం మరింత చురుకుగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే ఈ ఆకులను ఆహారంగా తీసుకోవడం వలన క్యాన్సర్ లాంటి ప్రాణాంతక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు.