ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు బేరి పండు అసలు తినకూడదు..!

పియర్స్ ఫ్రూట్( Pears ) దీనినే తెలుగులో బెరి పండు అని కూడా అంటారు.ఈ బేరి పండు తో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

 These People Should Not Consume Pears,pears,pears Fruit,digestive Issues,side Ef-TeluguStop.com

విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఇలా గుండెకు మేలు చేసే పోషకాలుతోపాటు క్యాన్సర్ వ్యాధితో పోరాడే గుణాలు కూడా ఈ బేరి పండు లో ఎన్నో ఉన్నాయి.అంతేకాకుండా అధిక బరువు తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్న వారికి ఇది మంచి డైట్ అని కచ్చితంగా చెప్పవచ్చు.

శరీరంలో మంటని కూడా ఇది తగ్గిస్తుంది.ఇన్ని సద్గుణాలు ఉన్న బేరి పండును ఎవరు పడితే వారు తినడానికి మాత్రం అస్సలు వీలుకాదు.


Telugu Digestive, Tips, Pears, Pears Fruit, Effects-Telugu Health

ఎందుకంటే కొంతమందికి ఇవి తింటే లాభాలకు బదులుగా నష్టాలు ఎక్కువగా ఉంటాయి.ఆ నష్టాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే జలుబు, దగ్గు, జ్వరం( Fever ) ఉన్నవాళ్లు ఈ బేరి పండు అసలు తినకూడదు.ఎందుకంటే బేరి పండు సాధారణంగానే చలువ చేస్తుంది.అలాంటిది ముందే జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారు ఈ పండు తింటే ఆ సమస్యలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.అంతే కాకుండా కొంతమంది అజీర్తి సమస్యలతో బాధపడుతూ ఉంటారు.

అటువంటివారు బేరి పండు తింటే అది వారిపై దుష్ప్రభావాలను చూపుతుంది.

Telugu Digestive, Tips, Pears, Pears Fruit, Effects-Telugu Health

బేరి పండు తినడం వల్ల జీర్ణశక్తి తగ్గిపోతుంది.దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు( Digestive Problems ) పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.అంతేకాకుండా అధిక రక్తపోటు ఉన్నవారు మోతాదుకు మించి బేరి పండ్లను తింటే అనేక అనారోగ్య సమస్యలు తప్పవు.

ఇంకా చెప్పాలంటే గుండె వేగం పెరగడం, కళ్లు తిరగడం, శ్వాస సంబంధిత సమస్యలు కూడా వస్తాయి.ఇంకా చెప్పాలంటే కొంతమందికి కొన్ని రకాల పండ్లు, ఆహార పదార్థాలు, కూరగాయలు తిన్నప్పుడు శరీరంలో దురద వస్తుంది.

అంటే వారికి ఆ ఫుడ్ తింటే ఎలర్జి వస్తుందని అర్థం చేసుకోవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే అలాంటివారు బేరి పండ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.అధిక బరువు తగ్గాలనుకునే వారు కూడా బేరి పండ్లను ఎక్కువగా తినకూడదు.మోతాదుకు మించి తింటే ఏ ఆహారమైన అనారోగ్య సమస్యలను పెంచుతుందని గుర్తుపెట్టుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube